అరుంధతి సినిమాతో హీరోలతో సమానంగా అనుష్క క్రేజ్ తెచ్చుకుంది. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. అవకాశాలు కూడా ఆమె ముందు ఎన్నో వాలాయి. కానీ ఆమె మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తోంది. బాహుబలి తర్వాత భాగమతి అనే సినిమాని మాత్రమే చేసింది. ఇది కూడా సూపర్ హిట్. దీని తర్వాత ఆమె ప్రాజక్ట్ ఏంటి ? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో ఒక థ్రిల్లర్ సినిమాకి ఒకే చెప్పింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించే ఈ చిత్రంలో మాధవన్ కీలకరోల్ పోషించనున్నారని, రచయిత కోనవెంకట్ దర్శకత్వం వహిస్తారని ప్రకటన కూడా వచ్చింది. అందుకు సైలెన్స్ అనే టైటిల్ ని కూడా ఖరారు చేసినట్లు చెప్పారు.
ఇక తమిళంలో గౌతం మీనన్ డైరక్షన్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఎప్పటి నుంచో చెప్పుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాల నుంచి అనుష్క తప్పుకున్నట్టు తెలిసింది. కారణం ఏమిటని ఆరా తీస్తే… కోన వెంకట్ సక్సస్ రేటు బాగా లేకపోవడం, పైగా స్క్రిప్ట్ సంతృప్తి కరంగా లేకపోవడం కారణాలని టాక్. గౌతమ్ మీనన్ చెప్పిన కథ బాగున్నప్పటికీ స్క్రిప్ట్ దశలో అంతగా బాగాలేదని.. అందుకే వదులుకున్నట్టు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. మంచి పేరు వచ్చిన తర్వాత దానిని డబ్బు కోసం ఆశపడి వృధా చేసుకోకూడదనే ఆలోచనలో అనుష్క ఉన్నట్టు తెలుస్తోంది. మంచి కథలు దొరికే వరకు ఇంట్లోనే రెస్ట్ తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తోంది.