మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా సైన్ చేసిన అనుష్క

దర్శకుడు హేమంత్ మ‌ధుక‌ర్ డైరెక్షన్ లో నిశ్శ‌బ్ధం అనే చిత్రం చేస్తుంది నటి అనుష్క. ఇందులో దివ్యాంగురాలి పాత్ర‌లో సంద‌డి చేయ‌నుంది. ఇక అనుష్క మ‌రో ప్రాజెక్ట్‌కి సంబంధించి తాజాగా ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ప్ర‌ముఖ ర‌చ‌యిత గోవింద్ నిహ్లాని రాసిన న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని, ఈ మూవీని గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ తెర‌కెక్కించ‌నున్నార‌ని సమాచారం. లేడీ ఓరియెంటెడ్ మూవీగా ఈ చిత్రం రూపొంద‌నుంద‌ట. ఇందులో బిగ్ బాస్ ఫేం అభిరామి వెంక‌టాచ‌లం కీల‌క పాత్ర పోషిస్తార‌ట‌. వేల్స్ ఫిల్మ్ ఇంట‌ర‌న్ఏష‌న్ ప‌తాకంపై రూపొంద‌నున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళ‌నున్న‌ట్టు సమాచారం.

పాపం సైజ్ జీరో సినిమా కోసం పెరిగిన బరువు తగ్గకపోవడంతో కథానాయికగా తక్కువ సినిమాలు చేస్తోంది కానీ.. ఆ సినిమాకి ముందు ఉన్నట్లుగా నాజూకుగా ఉన్నట్లయితే.. తమిళంలో నయనతార లాగా తెలుగులో అనుష్క టాప్ ప్లేస్ లో ఉండేది. తక్కువ సినిమాలు చేస్తేనేం.. మిగతా హీరోయిన్లు మూడు నాలుగు సినిమాలు చేస్తే సంపాదించే మొత్తాన్ని అనుష్క ఒకే ఒక్క సినిమాతో సంపాదిస్తోంది. ఈ సినిమాకి అమ్మడు దాదాపు 6 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోనుందట.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus