Anushka: అనుష్క సినిమా యూనిట్ జాగ్రత్త పడాల్సిందే..!

సాయి దుర్గ తేజ్ అలియాస్ సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) .. ‘గంజా శంకర్’ అనే సినిమాలో నటించబోతున్నట్టు ప్రకటించారు. సంపత్ నంది (Sampath Nandi) డైరెక్షన్లో తెరకెక్కాల్సిన ఈ సినిమాను ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. చిన్నపాటి గ్లింప్స్ కూడా వదిలారు. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్ అని చెప్పారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. చాలా వరకు ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) గట్టిగా ప్రయత్నించారు.

Anushka

కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు.బడ్జెట్ సమస్యల వల్లో లేక ఎందుకో తెలీదు కానీ..ఈ ప్రాజెక్టు ఆగిపోవడం వల్ల సాయి దుర్గ తేజ్ కి మంచే జరిగింది అని చెప్పాలి.ఎందుకంటే ఈరోజు సీఎంతో టాలీవుడ్ పెద్దలు భేటీ అవ్వడం.. అందులో ‘యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవీ కూడా ఉండకూడదని, డ్రగ్స్ తీసుకుంటున్నట్టు వంటి సన్నివేశాలు కూడా ఉండకూడదని’ తెలంగాణ ప్రభుత్వం సూచించింది.

ఒకవేళ తేజు కనుక ఆ సినిమా చేస్తున్నట్లు అయితే అతను చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేది. అయితే మరోపక్క అనుష్క(Anushka Shetty)  ప్రధాన పాత్రలో ‘ఘాటి’  (Ghaati) Sai Dharam Tejఅనే సినిమా తెరకెక్కుతుంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఇందులో హీరోయిన్ అనుష్క గం*యి స్మగ్లింగ్ చేసే ఓ గిరిజన యువతిగా కనిపించబోతుందట. అలాగే ఈ సినిమాలో గంజా ప్రస్తావన, దాని గురించి సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని ఇన్సైడ్ టాక్.

ఈ మధ్యనే షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. అయినప్పటికీ దర్శకుడు క్రిష్ ఆ సన్నివేశాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే రిలీజ్ టైంలో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2025 ఏప్రిల్ 18న ‘ఘాటి’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus