ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్ సర్కార్ తన పార్టీ కోసం మద్దతు తెలిపిన సినీ సెలెబ్రిటీలకు ఒక్కొక్కరికి తన ప్రభుత్వంలో కీలక పదవులు కట్టబెడుతోంది. ఇప్పటికే ఆలీ పోసాని వంటి వారికి కీలక పదవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం తాజాగా సింగర్ మంగళకి కూడా కీలకమైన పదవి కల్పించారు. సింగర్ మంగ్లీ గత ఎన్నికలలో భాగంగా ప్రచార సమయంలో పార్టీ తరపున పెద్ద ఎత్తున పాటలు పాడుతూ ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఇలా వైఎస్ఆర్సిపి పార్టీ కోసం మద్దతు తెలిపిన సింగర్ మంగ్లీ కి తాజాగా జగన్ సర్కార్ కీలక పదవిలో కూర్చోబెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ బోనాల పాటలతో ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె సినిమా పాటలు పాడుతూ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే మంగ్లీ కోసం ఏపీ ప్రభుత్వం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డు అడ్వైజర్ గా మంగ్లీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక ఈ బాధ్యతలు చేపట్టినందుకు మంగ్లీ నెలకు లక్ష రూపాయలు చొప్పున జీతం అందుకోవడమే కాకుండా రెండు సంవత్సరాల పాటు ఈ బాధ్యతలను నిర్వర్తించనున్నారు.ఇలా తన పార్టీ కోసం కష్టపడి మద్దతు తెలిపినటువంటి సినీ సెలబ్రిటీలకు ఒక్కొక్కరికి జగన్ తన ప్రభుత్వంలో వారికి ఉన్నత పదవులు కల్పిస్తున్నారు.
కమెడియన్ అలికి ఏపీ ఎలక్ట్రానిక్ సలహాదారుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, నటుడు పోసాని కృష్ణ మురళికి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ గాఏపీ ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా సింగర్ మంగ్లీకి సైతం వెంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డ్ అడ్వైజర్ గా నియమించారు.
ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!
మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!