Jagan, Nagarjuna: బంగార్రాజు విషయంలో జరగబోయేది అదేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్ల విషయంలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తామని కీలక ప్రకటన చేసింది. అయితే నైట్ కర్ఫ్యూ అమలను వాయిదా వేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం బంగార్రాజు సినిమాకు ప్లస్ కానుంది. సంక్రాంతికి విడుదలవుతున్న పెద్ద సినిమా బంగార్రాజు కావడంతో ఈ సినిమా హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడయ్యాయి.

నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటే సెకండ్ షో విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ అమలు వాయిదా వల్ల ఫస్ట్ వీకెండ్ వరకు బంగార్రాజుకు ఇబ్బందులు ఎదురు కావు. ఇప్పటికే రిలీజైన బంగార్రాజు ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లో నాగార్జున కంటే నాగచైతన్యనే ఎక్కువగా హైలెట్ చేయడం గమనార్హం. నాగార్జున, చైతన్య ఖాతాలో ఈ మూవీతో మరో సక్సెస్ గ్యారంటీ అని ప్రేక్షకులు భావిస్తున్నారు.

50 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బంగార్రాజు థియేటర్లలో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. అయితే బంగార్రాజు సినిమాకు హిట్ టాక్ వచ్చినా ఏపీలో బ్రేక్ ఈవెన్ కావడం కష్టమని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. పుష్ప , అఖండ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా ఏపీలోని పలు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదనే సంగతి తెలిసిందే. బంగార్రాజు విషయంలో కూడా అదే జరిగే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

నాగార్జునకు, కళ్యాణ్ కృష్ణకు బంగార్రాజు సక్సెస్ కీలకమనే సంగతి తెలిసిందే. బంగార్రాజు ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండటంతో అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. కృతిశెట్టి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది. సరైన సక్సెస్ లేని రమ్యకృష్ణ సైతం బంగార్రాజు సినిమాపై ఆశలు పెట్టుకున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus