Nagarjuna: ఏపీలో నైట్ కర్ఫ్యూ.. థియేటర్స్ మళ్ళీ అప్పట్లానే..!

  • January 10, 2022 / 07:50 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ సంక్రాంతికి రాబోయే సినిమాలకు మరొక బ్యాడ్ న్యూస్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా సరికొత్త కరోనా ఆంక్షలను ప్రవేశపెట్టే అవకాశం ఉందని అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక అందరూ ఊహించినట్టుగానే నైట్ కర్ఫ్యూ విషయంలో అలాగే థియేటర్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో అర్ధరాత్రి కర్ఫ్యూని కొనసాగిస్తున్నట్లు గా ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది.

రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా కర్ఫ్యూ ఉంటుందట. ప్రస్తుతం రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ఈ విధమైన ఆంక్షలను ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే సినిమా థియేటర్స్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. గతంలో మాదిరిగానే రద్దీ ఎక్కువగా ఉండకుండా థియేటర్స్ 50% ఆక్యుపెన్సీ లోనే కొనసాగించాలని రూల్ ను తీసుకువచ్చారు.. సినిమా థియేటర్ లో ప్రతీ సీటు మధ్యలో ఒక సీటు ఖాళీ గా ఉండాలి అని ఈ నిబంధనలలో ప్రతి ఒక్క థియేటర్ యాజమాన్యం కూడా తప్పనిసరిగా పాటించాలని వివరణ ఇచ్చారు.

ఈ దెబ్బతో సంక్రాంతికి రాబోయే సినిమాల కలెక్షన్స్ భారీగా తగ్గే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా నాగార్జున బంగార్రాజు సినిమా పైనే అందరి ఫోకస్ ఉంది. ఈ సినిమా అత్యధిక థియేటర్స్ లో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. దాదాపు 39 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ తో రాబోతున్న బంగార్రాజు అతి తక్కువ టికెట్లతో అలాగే ఆంధ్రప్రదేశ్లో బాక్సాఫీస్ టార్గెట్ ను పూర్తి చేయడం చాలా కష్టం అని చెప్పవచ్చు..

ఇదివరకే నాగార్జున టికెట్ల రేట్ల విషయంలో తనకు ఎటువంటి అభ్యంతరం లేదు అని తక్కువ ఉన్నా కూడా పరవాలేదు అని చెప్పారు. మరి బంగార్రాజు సినిమా ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ ప్రభావంతో డీజే టిల్లు సినిమా కూడా వాయిదా పడింది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus