Movie Tickets: ఆ వెబ్ సైట్లలో సినిమా టికెట్లను బుక్ చేసుకోలేమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కొన్ని నెలల క్రితం సినిమా టికెట్ల అమ్మకాల కొరకు ఒక వెబ్ సైట్ ను అందుబాటులోకి తెస్తామని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం సొంతంగా వెబ్ సైట్ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు చేపడుతుందని అందరూ భావించారు. ఈ విషయంలో ప్రతిపక్షాల నుంచి ఏపీ సర్కార్ పై విమర్శలు సైతం వ్యక్తమయ్యాయనే సంగతి తెలిసిందే. అయితే ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల అమ్మకాల కొరకు టెండర్లను పిలిచింది.

Click Here To Watch NOW

టెండర్లలో అల్లు కుటుంబానికి చెందిన జస్ట్ టికెట్స్ సంస్థను ప్రభుత్వం ఎంపిక చేసిందని సమాచారం. అతి త్వరలో ఏపీ ప్రేక్షకులు బుక్ మై షో, పేటీఎం ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకోవడం సాధ్యం కాదని కేవలం జస్ట్ టికెట్స్ ద్వారా మాత్రమే టికెట్లను బుకింగ్ చేసుకునే వీలు ఉంటుందని సమాచారం అందుతోంది. ఏప్రిల్ 1 నుంచి ఈ విధంగా ఏపీలోని అన్ని థియేటర్లకు సంబంధించిన టికెట్ల అమ్మకాలు జరగనున్నాయని తెలుస్తోంది.

అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత రావాల్సి ఉంది. టెండర్లలో బుక్ మై షో, జస్ట్ టికెట్స్ పాల్గొన్నాయని తక్కువ ధరకు సర్వీస్ అందించడానికి జస్ట్ టికెట్స్ ముందుకొచ్చిందని బోగట్టా. ఏపీ ప్రభుత్వం నిర్ణయం ఫలితంగా ఆన్ లైన్ లో టికెట్లను బుకింగ్ చేసుకునే వాళ్లకు కొంతమేర ఛార్జీలు తగ్గనున్నాయి. అతి త్వరలో ఏపీ ప్రేక్షకులు జస్ట్ టికెట్స్ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా మాత్రమే టికెట్లను బుకింగ్ చేసుకోవాలి.

ఆన్ లైన్ లో టికెట్లను బుకింగ్ చేసుకోలేని వాళ్లు ఆఫ్ లైన్ లో టికెట్లను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుందని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం నిర్ణయం విషయంలో ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. ఏపీ సర్కార్ సినిమా టికెట్ల అమ్మకాల విషయంలో మోసాలకు చెక్ పెట్టేందుకు, ఆన్ లైన్ లో టికెట్లను బుకింగ్ చేసుకునే వాళ్లపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus