‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు పర్మిషన్ ఇవ్వని ఏపీ ప్రభుత్వం.. కారణమేంటంటే..

  • January 4, 2023 / 10:51 PM IST

ఈ సంక్రాంతికి ఇద్దరు అగ్రకథానాయకుల చిత్రాలను రంగంలోకి దింపుతూ.. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకాభిమానులకు పెద్ద పండుగ జాతరను చూపించడానికి సిద్ధమవుతున్న మైత్రీ మూవీ మేకర్స్‌కి దెబ్బ మీద దెబ్బ పడుతోంది.. ఓ వైపు థియేటర్ల సమస్యతో సతమతమవుతున్న నిర్మాతలు.. స్పెషల్, అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపు గురించి మైత్రీ వారు ఏపీ సీఎం పేషీని కలిశారు. వారికి పరిస్థితులను వివరించి అనుమతినివ్వాలని కోరారు.. వారు కూడా సానుకూలంగా స్పందించారని.. త్వరలోనే టికెట్ రేట్ల పెంపు విషయంలో ఏపీ ప్రభుత్వం నుండి పాజిటివ్ నిర్ణయం వస్తుందనే ఆశతో ఉన్నారని వార్త విని..

ఇంకా దాని గురించి మాట్లాడుకుంటూ ఉండగానే ఏపీ సర్కార్ మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణలకు షాక్ ఇచ్చింది. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు అనుమతి లేదంటూ ఆర్డర్ వేసింది.. దీంతో నిర్మాతల పరిస్థితి తాటికాయ సామెతలా తయారయ్యింది. జనవరి 6న ఒంగోలులోని ఏబీఎం కాలేజీ గ్రౌండ్స్‌లో ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత విశాఖపట్నంలో ‘వాల్తేరు వీరయ్య’ ఫంక్షన్ ప్లాన్ చేశారు.

కట్ చేస్తే సర్కార్ ఇప్పుడు షాక్ ఇచ్చింది.. ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోకుండా నిర్మాతలు ఏర్పాట్లు ఎందుకు చేసుకుంటారు?.. ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వనిదే అధికారికంగా ఎందుకు ప్రకటిస్తారు? అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వాధికారులు చెప్తున్న సమాధానం ఏంటంటే.. ఈమధ్యనే రోడ్ షోలు, బహిరంగ సభలకు అనుమతి లేదని ప్రకటించిన నేపథ్యంలో.. వేలాది, లక్షలాది సంఖ్యలో జనాలు గుమిగూడతారు.

అలాంటప్పుడు వారిని నియంత్రించడం చాలా కష్టం.. అందుకే అనుమతి నిరాకరిస్తున్నాం అని అంటున్నారని సినీ వర్గాల వారి సమాచారం.. బాలయ్య సినిమా ఫంక్షన్ ఎల్లుండే కావడంతో ఏం చేయాలో అర్థం కాక.. ఒంగోలులోని మరో చోటికి వేదిక మార్చే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లకే పర్మిషన్ లేదంటే.. ఇంక టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోలకు అనుమతినిస్తారని ఆశ పెట్టుకోవడం దండగే అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి..

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus