Ap Tickets: ఏపీ టికెట్‌ బుకింగ్‌.. కొత్త రూల్స్‌ ఇవే!

  • June 3, 2022 / 04:25 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్లపై తద్వారా సినిమా పరిశ్రమపై ప్రభుత్వం మరో బాంబు వేసింది. ఆన్‌లైన్‌ టికెటింగ్ తీసుకొస్తాం అంటూ చాలా రోజులగా చెబుతున్న వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం… తాజాగా దానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారం చూస్తే ఆన్‌లైన్‌ టికెటింగ్‌కి మారని థియేటర్ల లైసెన్స్‌ను రద్దు చేస్తామని ప్రభుత్వం స్పస్టం చేసింది. ఈ మేరకు ఏపీలో ఆన్‌లైన్‌ విధానంలో సినిమా టికెట్ల విక్రయాలను తప్పనిసరి చేస్తూ వాటి విధి విధానాల్ని ప్రభుత్వం ఖరారు చేసింది.

ఈ క్రమంలో టికెట్‌ రేటులో సర్వీసు ట్యాక్స్‌ టికెట్‌ ధరపై 2 శాతానికి మించి ఉండకూడదని ప్రభుత్వం నిర్దేశించింది. ఆన్‌లైన్‌ విధానంలో సినిమా టికెట్ల విక్రయానికి సర్వీసు ప్రొవైడర్‌ను నియమించే బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (APSFTVTDC)కి అప్పగించింది. అలాగే ఆ సంస్థే నిర్వహణ చేపడుతుందని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఆ విధంగా APSFTVTDC నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని చెప్పింది.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ సినిమా నియమావళి 1970ను జగన్‌ ప్రభుత్వం సవరించింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్‌ గుప్తా గురువారం రాత్రి దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ఉత్తర్వు ప్రకారం ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తున్న సంస్థలు, సినిమా థియేటర్లు ఆ కార్యకలాపాలను ఎప్పటిలాగే కొనసాగించొచ్చు. అయితే నోడల్‌ ఏజెన్సీ నియమించిన సర్వీసు ప్రొవైడర్‌ గేట్‌వే ద్వారానే టికెట్ల విక్రయాలు చేపట్టాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాల కోసం ఏపీలోని సినిమా థియేటర్లన్నీ APSFTVTDCతో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఆ తర్వాత సర్వీసు ప్రొవైడర్‌ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం అవ్వడానికి అవసరమయ్యే మౌలికవసతుల్ని థియేటర్ల యాజమాన్యాలే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అలాగే కొత్త సినిమా విడుదలకు వారం ముందు నుండి మాత్రమే టిక్కెట్లను విక్రయించాలని సూచించింది. నెలరోజుల్లోగా రాష్ట్రంలోని థియేటర్లలో ఆన్లైన్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా నిబంధనలు పాటించని థియేటర్ల లైసెన్సులను రద్దు చేస్తామని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus