తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమంప్రస్తుతం ఆరవ సీజన్ ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం పై గతంలో నుంచి పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టులో అడ్వకేట్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా కోర్ట్ ఈ పిటిషన్ ను పరిగణలోకి తీసుకొని విచారించింది. అయితే గతంలో ఒకసారి ఈ పిటిషన్ పై విచారణ జరగగా 1970 లలోనే ఇలాంటి సినిమాలు వచ్చాయో తెలియదా అంటూ తీసుకొని అక్టోబర్ 11 కు వాయిదా వేసిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే 11వ తేదీ విచారణ జరిపిన అనంతరం కోర్టు ఈ విషయంపై తీర్పును ప్రకటిస్తూ బిగ్ బాస్ కార్యక్రమాన్నితాము కూడా రెండు ఎపిసోడ్లు చూసిన తర్వాత తీర్పు ప్రకటిస్తామని వెల్లడించారు.ఈ క్రమంలోనే తదుపరి విచారణను అక్టోబర్ 27వ తేదీకి వాయిదా వేశారు. ఇక ఈ కార్యక్రమం విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ప్రకటిస్తుందో తెలియాల్సి ఉంది.అయితే కోర్టు ఈ కేసును పలుమార్లు వాయిదా వేస్తుండడంతో కొందరు ఈ విషయంపై స్పందిస్తూ తీర్పు వచ్చేలోపు బిగ్ బాస్ 6 కార్యక్రమం పూర్తి అవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ కార్యక్రమంలో ఎక్కువగా అశ్లీలత ఉందని ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజానికి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదన్న ఉద్దేశంతోనే ఈ షోపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ కార్యక్రమంపై ఇదివరకే ఎంతోమంది తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇక సిపిఐ నారాయణ ఏకంగా బిగ్ బాస్ కార్యక్రమాన్ని బ్రోతల్ హౌస్ గా పోలుస్తూ చేసిన కామెంట్ వైరల్ అయ్యాయి. మరి ఈ కార్యక్రమం పై అక్టోబర్ 27వ తేదీ ఏ విధమైనటువంటి తీర్పు ప్రకటిస్తుందో తెలియాల్సి ఉంది.