Martin Luther King: ఏపీ రాజకీయాల మీద కౌంటర్‌… ఆ సినిమా బయటకు వస్తుందా?

మొన్నీమధ్యే సినిమాలకు, రాజకీయాలకు మధ్య ఉన్న టామ్‌ అండ్‌ జెర్రీ రిలేషన్‌ గురించి మాట్లాడుకున్నాం. రాజకీయాల్లో జరిగింది సినిమాల్లో చూపిస్తారు, ఆ చూపించిన విషయాలు చూసి రాజకీయ నాయకులు హర్ట్‌ అవుతారు అని. అయితే చూపించే విధానంలో, చెప్పే విధానంలో ఇబ్బంది ఉంటే ఓకే కానీ.. సెటైరికల్‌ చెబితే సరిగ్గా తీసుకోకపోతే కష్టం. ఇప్పుడు ఇదంతా మళ్లీ ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే… మరో సినిమాలో ప్రస్తుత రాజకీయాల గురించి చర్చ వచ్చింది కాబట్టి.

సంపూర్ణేశ్‌ బాబు ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్‌ కామెడీ డ్రామా చిత్రం ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’. పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. అక్టోబర్‌ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. గ్రామాల్లో ఎన్నికలు, అక్కడి పరిస్థితుల గురించి ఆ సినిమాలో చర్చించినట్లు మీకు ఈజీగానే అర్థమవుతుంది. అయితే ఒక్క డైలాగ్‌ మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రస్తుత పరిస్థితులపై కౌంటర్‌ వేసేలా ఉంది. దీంతో అక్కడ సినిమా విడుదలకు అఒంతా ఓకేనా అనే ప్రశ్న మొదలైంది.

‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’ (Martin Luther King) సినిమాలో గ్రామంలో పోటీ చేసే నాయకులుగా వెంకటేశ్‌ మహా, సీనియర్‌ యాక్టర్‌ నరేశ్ కనిపిస్తారు. ఓ సన్నివేశంలో ‘నేను గెలిస్తే ఓటర్లకు రూ. 15 వేలు ఇస్తాను’ అని నరేశ్‌ పాత్ర అంటుంది. అలా ఎందుకు మాటిచ్చావు అని పక్కనున్న వ్యక్తి అడిగితే… ఇప్పడు రాష్ట్రంలో ఇదే కదా నడుస్తోంది అని అంటారు. అంటే ప్రజలకు రూ. పది వేలు, రూ. పదిహేను వేలు ఇచ్చే పరిస్థితి ఏపీలోనే ఉంది. ప్రభుత్వం అధికారికంగానే డబ్బులు ఇస్తోంది.

దీంతో ఆ డైలాగ్‌ ఏపీ ప్రభుత్వం మీదనో, అక్కడ అధికారంలో ఉన్న పార్టీ మీదనో అని సోషల్‌ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ సినిమా రిలీజ్‌ చేస్తారా అంటూ చమకులు కూడా పడుతున్నాయి. ఇక ఈ సినిమాను అక్టోబర్ 27 థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. తమిళంలో మంచి విజయం అందుకున్న ‘మండేలా’కు ఈ సినిమా రీమేక్‌ అన్న విషయం తెలిసిందే.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus