కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి సీరియల్స్ లో బ్రహ్మముడి సీరియల్ ఒకటి. నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… అప్పు కళ్యాణ్ కి ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు దాంతో అప్పు చాలా కోపంగా ఉంటుంది. ఇక కళ్యాణ్ వచ్చేలాగా లేడు వెళ్లిపోవాలని వెనుతిరిగిన అప్పు వెనకనే కళ్యాణ్ ఉండటం చూసి షాక్ అవుతుంది. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడానికి ఏదో ఒక రీసన్ ఉంటుంది కదా ఆ రీజన్ ఏంటో చెప్పు అంటూ అప్పు అడగడంతో అనామిక కలుస్తానంటే వెళ్లానని కళ్యాణ్ చెబుతారు. అనామిక కలుస్తానంటే నన్ను దూరం పెడతావా అంటూ అపర్ణ ఫైర్ అవుతుంది.
తను కలిస్తే నిన్ను ఎందుకు దూరం పెడతాను నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి ఇప్పుడు నాకు ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు అని కళ్యాణ్ అనగా నేను తను ఒకటేనా అంటూ అప్పు మాట్లాడుతుంది. అనామిక నీ కవితలు నచ్చింది ఫ్రెండ్ అయింది కానీ నేను నిన్నుగా స్నేహితుడిగా భావించాను అనడంతో నువ్వు ఎప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ తను నా అభిమాన స్నేహితురాలు అంటూ కళ్యాణ్ మాట్లాడతారు. మరుసటి రోజు ఉదయం వరలక్ష్మి వ్రతం కావడంతో చిట్టి కనకంకి ఫోన్ చేసి రేపు ఉదయం వరలక్ష్మి వ్రతం చేస్తున్నాము మీరు రావాలి అని ఆహ్వానించగా మొన్ననే అంత పెద్ద గొడవ జరిగింది నేను ఈ పూజకు వచ్చి వదిన గారి మొహం ఎలా చూడాలి? తను కూడా చాలా ఇబ్బంది పడుతుంది రాలేమని చెబుతుంది.
మనస్పర్ధలు వచ్చాయని దూరంగా ఉంటే దూరం పెరుగుతుంది. ఇలాంటి దూరాన్ని దగ్గర చేసేవే ఈ పండుగలు కూతురు తన సౌభాగ్యం కోసం వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే ఆశీర్వదించడానికి తల్లి కంటే ఒక గొప్ప ముత్తైదువు ఎవరు ఉంటారు మీరు తప్పకుండా రావాలి అనడంతో సరేనని కనకం చెబుతుంది. తర్వాత పూజకు వెళ్లాలంటే ఒక పట్టుచీర గ్రామ బంగారమైన తీసుకెళ్లాలి అంటూ కనకం కంగారుపడగా కృష్ణమూర్తి సరేనని చెబుతారు. ఇక కావ్య కిచెన్ లో పని చేస్తూ ఉండగా అక్కడికి వెళ్లినటువంటి అపర్ణ నిన్ను ఇలా ఈ ఇంట్లో తిరగడం చూస్తుంటే నాకు ఏమాత్రం నచ్చడం లేదు. నా జీవితంలో నేను నిన్ను కోడలిగా అసలు అంగీకరించను అలాగే నా కొడుకు కూడా నిన్ను భార్యగా అంగీకరించరని చాలెంజ్ చేస్తుంది అపర్ణ.
అపర్ణ ఇలా మాట్లాడటంతో కావ్య మాట్లాడుతూ మీరు చాలా ఎంజాయ్ చేసిన ప్రతిసారి నాకు మంచే జరుగుతుంది ఇంట్లోకే రానివ్వను అన్నారు ఇంట్లోకి వచ్చాను మా కుటుంబంతో సంబంధం కలపకూడదన్నారు వారితో బంధం ఏర్పడింది. ఈ జన్మకు మారరు అని మీరు అనుకుంటున్నారు మీరు కూడా మారుతారేమో మీరే మీ అబ్బాయి మనసు మారుస్తారేమో అని కావ్య మాట్లాడగా నా కొడుకు నా మనసుకు నచ్చని పని ఎప్పుడు చేయడు. రేపు నేను వ్రతంలో నిన్ను ఆశీర్వదించను నా కొడుకు కూడా నీ తలపై అక్షింతలు వేసి ఆశీర్వదించడు అంటూ అపర్ణ మాట్లాడుతుంది అయితే ఈ విషయాలన్నీ కూడా రాజ్ వింటాడు.
కావ్య తన గదిలోకి వెళుతుండగా పూజ నువ్వు చెయ్యి ఫలితం నేనిస్తాను అంటూ రాజ్ సీరియస్ గా మాట్లాడుతారు ఏం చేస్తారు అంటూ కావ్య అనడంతో జస్ట్ వెయిట్ అండ్ సి అంటారు. మరుసటి రోజు ఉదయం వ్రతం బాధ్యతలు నీకు అప్పచెప్పాను ఎలాంటి తప్పిదాలు చేయకు అంటూ చిట్టి కావ్యకు చెబుతుంది సరే అమ్మమ్మ గారు అంటూ కావ్య పూజ ఏర్పాట్లలో ఉంటుంది మరోవైపు కళ్యాణ్ ప్రకాష్ టిఫిన్ చేయడం కోసం గొడవ పడతారు. పూజ పూర్తి అయ్యేవరకు ఉపవాసం ఉండాల్సిందేనని ధాన్యలక్ష్మి మాట్లాడుతుంది. మరోవైపు కనకం కంగారు చూసి అప్పు ఏమైందని మాట్లాడటంతో అక్క వాళ్ళింట్లో పూజ ఉంది మీ నాన్న డబ్బులు తీసుకురావడానికి వెళ్లారు ఇంకా రాలేదు అనగా అంతలోపు కృష్ణమూర్తి వచ్చి డబ్బులు ఇచ్చి తల్లితో పాటు కూతుర్ని కూడా పంపిస్తారు.
ఇక కావ్య పూజకు అన్ని ఏర్పాట్లు చేసి అమ్మవారిని ఎంతో అందంగా అలంకరిస్తుంది. అది చూసిన చిట్టి అమ్మవారిని చాలా బాగా అలంకరించావమ్మా అంటూ మాట్లాడుతూ ఉండగా అంటే వదిన ఇన్ని రోజులు సరిగా చేయలేదని నీ ఉద్దేశమా అమ్మ అంటూ రుద్రాన్ని మాట్లాడుతుంది. దీంతో రోజు ఏదో ఒక విషయంలో పుల్లలు పెట్టకపోతే నీకు మనశ్శాంతి ఉండదు కదా అంటూ ధాన్య లక్ష్మి రుద్రాణి మీద కోపడుతుంది. తరువాయి భాగంలో (Brahmamudi) పూజ పూర్తి అవుతుంది రాజ్ మాత్రం తనకు ఆశీర్వదించకుండా వెళ్లిపోతారు. దీంతో కావ్య షాక్ అవుతుంది అపర్ణ సంతోషపడుతుంది.