Appudo Ippudo Eppudo Trailer Review: నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

నిఖిల్  (Nikhil Siddhartha) హీరోగా సుధీర్ వర్మ  (Sudheer Varma)  దర్శకత్వంలో ‘స్వామి రారా’ (Swamy Ra Ra) , కేశవ (Keshava) వంటి సినిమాల తర్వాత రూపొందిన చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo). నవంబర్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన టీజర్, రెండు పాటలు బాగున్నాయి. ఈ సినిమా షూటింగ్ మొత్తం విదేశాల్లోనే జరిగింది అని ప్రమోషనల్ కంటెంట్ స్పష్టం చేసింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో తాజాగా ట్రైలర్ ను కూడా వదిలారు చిత్ర యూనిట్ సభ్యులు.

Appudo Ippudo Eppudo Trailer Review

2 నిమిషాల 8 సెకన్ల నిడివి కలిగిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ట్రైలర్.. కమెడియన్ సత్య వాయిస్ ఓవర్ తో మొదలైంది. విదేశాల్లో కార్ రేసర్ అవ్వాలనుకునే హీరో.. డబ్బు కోసం హీరోయిన్లు రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)  , దివ్యంశ కౌశిక్(Divyansha Kaushik)..లతో డేటింగ్ వ్యవహారాలు నడపడం, మరోవైపు ఊహించని విధంగా కేసులో ఇరుక్కోవడం వంటివి చూపించారు. కమెడియన్స్ వైవా హర్ష (Harsha Chemudu)  , సుదర్శన్ (Sudharshan Reddy),  సత్య (Satya) .. కూడా ఉన్నారు కాబట్టి.. కామెడీకి కూడా మంచి స్కోప్ ఉందనే ఆశలు రేకెత్తించింది ఈ ట్రైలర్.

అలాగే హీరో అండ్ గ్యాంగ్ ని…పోలీస్ గ్యాంగ్, విలన్ గ్యాంగ్ కి చెందిన అజయ్, జాన్ విజయ్..లు ఎందుకు టార్గెట్ చేశారు? అనే సస్పెన్స్ ని కూడా రేకెత్తిస్తూ ట్రైలర్ ను కట్ చేశారు. ఈ ట్రైలర్ విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా దర్శకుడు సుధీర్ వర్మ టేస్ట్ కి తగ్గట్టు ఉంది. మొత్తంగా ట్రైలర్ బాగానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

తెలంగాణలో ‘క’ లాంటి విలేజ్.. ఏమిటా మిస్టరీ?

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus