Apsara Rani: బోల్డ్ బ్యూటీ అప్సర రాణికి కూడా ఇలాంటి చేదు అనుభవమా..!

‘4 లెటర్స్’ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అప్సర రాణి అటు తర్వాత ‘ఉల్లాలా ఉల్లాలా’ అనే చిత్రంలో కూడా అంటించింది. ఆ రెండు చిత్రాలతో ఈమెకు ఆశించిన బ్రేక్ రాలేదు.అయితే ఈ క్రమంలో ఆమె రాంగోపాల్ వర్మ దృష్టిలో పడింది. వర్మ డైరెక్షన్లో ఈమె చేసిన ‘థ్రిల్లర్’ ‘మా ఇష్టం’ వంటి చిత్రాలు ఈమెను బాగా పాపులర్ చేశాయి. దీంతో ఆమెకు ‘క్రాక్’ ‘సీటీమార్’ వంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేసే ఆఫర్లు దక్కాయి.

ఆ రెండు సినిమాల్లో ఈమె చేసిన ఐటెం సాంగ్స్ బాగా క్లిక్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. అప్సర రాణి బోల్డ్ నెస్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇంత డేరింగ్ అండ్ డాషింగ్ అమ్మాయికి కూడా కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి. ఆమె మాటల్లోనే.. “కన్నడ పరిశ్రమకు చెందిన ఓ దర్శకుడు.. ఒక సినిమాలో అవకాశం ఇస్తాను అంటే వెంటనే వెళ్లి కలిశాను. తీరా వెళ్ళాక.. అతను గదిలోకి పిలిచాడు,అలా వెళితే… ‘నా కోరిక తీరుస్తావా? అవకాశం ఇస్తాను’ అని అన్నాడు.

దీంతో వెంటనే భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు వచ్చాయి’ అంటూ ఈమె చెప్పుకొచ్చింది. ఇదే క్రమంలో రాంగోపాల్ వర్మ పైకి కనపడిన గొప్ప వ్యక్తి అంటూ అతన్ని మోసేసింది ఈ అమ్మడు. ‘అతను తీసే సినిమాలు చాలా అశ్లీలంగా, కుటుంబ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి’ కదా అని ఆమెను అంటే..!

‘అందుకే ఆయన్ని తిడుతున్నారు. ఆయన్ని తిట్టే ప్రతి ఒక్కరూ ఆయన ఏమి చేసినా చూసి తిడుతున్నారు. సో ఎక్కువ మంది ఆయన్ని తిడుతున్నారు అంటే.. వర్మ గారు ఏం చేసినా చూస్తున్నారు అనే కదా అర్థం. అప్పుడు ఆయన అన్నట్టు చూడడం మానేయొచ్చు కదా’ అంటూ ఈమె బదులిచ్చింది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus