Prabhas: సర్జరీ కోసం ప్రభాస్ ఫాలో అయిన థెర‌పీ అదేనట..!

  • August 24, 2022 / 01:49 PM IST

వరుసగా పెద్ద ప్రాజెక్టుల్లో నటించడం వల్లనో ఏమో కానీ మొన్నామధ్య ప్రభాస్ చాలా లావు అయ్యాడు.అతని ఫేస్ లో కూడా మునుపటి గ్లో చాలా మిస్ అయ్యింది. ‘యాక్షన్ అనగానే ప్రభాస్ దేనిని లెక్క చేయకుండా షూటింగ్ లో పాల్గొంటాడు.. కొండ మీద నుండి దూకెయ్యామన్నా దూకేస్తాడు.. అంత డెడికేషన్ ప్రభాస్ కు ఉంది’ అంటూ రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పాడు. నిజమే అయ్యుంటుంది అందుకే ఈమ‌ధ్య ప్ర‌భాస్‌కి చాలా సర్జెరీలు జరిగాయి.

అయితే గ‌త కొంత‌కాలంగా ప్రభాస్ మోకాలి నొప్పితో బాధ‌ప‌డుతూ వస్తున్నాడు.ఈ మధ్యనే సర్జెరీ కోసం విదేశాలకు వెళ్ళాడు.. కానీ ఆ సర్జెరీ కోసం అతను బరువు తగ్గాలి అని వైద్యులు సూచించారట.బరువు తగ్గడం కోసం అతను మోకాలి నొప్పితో వర్కౌట్లు వంటివి చేయడం కష్టం కాబట్టి.. ఓ థెరపీని ఫాలో అయ్యాడట.`సీతారామం` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్ర‌భాస్ చాలా సన్నగా కనిపించాడు. దీనికి కార‌ణం అతను… ఆక్వా థెర‌పీ తీసుకోవడమే అని తెలుస్తుంది.

ఇది చాలా స‌హ‌జ‌మైన ప‌ద్ధతి అని తెలుస్తుంది. కండరాల నొప్పితో బాధపడే వారు బరువు తగ్గడానికి ఇదే బెస్ట్ థెరపీ అట. ప్ర‌భాస్ దీనిని ఫాలో అయ్యి బరువు తగ్గినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రభాస్ సర్జరీకి రెడీ అయినట్టే.! త్వ‌ర‌లోనే మళ్ళీ విదేశాలకు వెళ్లి సర్జెరీ చేయించుకోనున్నాడు ప్రభాస్.

ఆ త‌ర‌వాత 2,3 వారాలు విశ్రాంతి తీసుకొని `ప్రాజెక్ట్ కె`, `స‌లార్‌` షూటింగుల్లో పాల్గొంటాడని సమాచారం. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ ‘రాధే శ్యామ్’ చిత్రాలు నిరాశపరిచాయి. కాబట్టి ఓ మంచి హిట్టు కొట్టి అభిమానులను సంతృప్తి పరచాలని ప్రభాస్ భావిస్తున్నాడు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus