Ar Murugadoss: ‘సికందర్’ ప్లాప్ అవ్వడానికి సల్మాన్ ఖానే కారణం: మురుగదాస్

దర్శకుడు మురుగదాస్.. తన ‘సికందర్’ మూవీ రిజల్ట్ గురించి మాట్లాడుతూ హీరో సల్మాన్ ఖాన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘సికందర్’ ప్లాప్ కి పూర్తిగా హీరోదే(సల్మాన్ ఖాన్) తప్పు అన్నట్టు అతను కీలక వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యాడు. మరోస్టార్ దర్శకుడు అట్లీ సల్మాన్ ఖాన్ తో సినిమా చేయకపోవడానికి కారణం కూడా.. అతని తీరు అంటూ ఘాటుగా స్పందించాడు.

Ar Murugadoss

మురుగదాస్ మాట్లాడుతూ.. “ఒక స్టార్ హీరోతో సినిమా చేయడం అనేది చిన్న విషయం కాదు. చాలా కష్టమైన వ్యవహారం. పగలు చేయాల్సిన సన్నివేశాలు ఉంటాయి. అవి అప్పుడే తీయాలి. కానీ నేను సినిమా చేసిన స్టార్ హీరోకి ప్రాణహాని ఉంది. కాబట్టి అతను ఉదయం పూట షూటింగ్ కి రాలేడు. రాత్రి 8 గంటలకు సెట్స్ కి వచ్చేవాడు.ఆ టైంలో మేము షూటింగ్ చేయాల్సి వచ్చేది. రాత్రి మొదలుపెట్టి తెల్లవార్లూ షూటింగ్ చేస్తూనే ఉండే వాళ్ళం. మేమైతే అలవాటు పడ్డాం. కానీ అందరి పరిస్థితులు ఒకలా ఉండవు కదా.

ఒక సీన్లో నలుగురు పిల్లలు ఉండేవారు. మేము వారితో తెల్లవారుజామున 2 గంటలకు షూట్ చేయాల్సి వచ్చేవాళ్ళం. వాళ్ళు స్కూల్ నుండి తిరిగి వచ్చే సీన్ అది. అలాంటి సీన్లు కూడా తెల్లవారు జామున తీసేవాళ్ళం. ఆ టైంలో అంతా అలసిపోయి నిద్రపోతుండేవారు. భార్య అవయావాలు దానం చేయడం. వాళ్ళను వెతుక్కుంటూ హీరో వెళ్లడం అనే థీమ్ ఎమోషనల్ గా చెప్పాలి. కానీ మేము ఉన్న పరిస్థితుల రీత్యా అలా చేయలేకపోయాము” అంటూ మురుగదాస్ చెప్పుకొచ్చింది.

డిస్ట్రిబ్యూటర్స్ ని కూల్ చేయడానికే అలా చెప్పారా.. ‘మాస్ జాతర’ రిలీజ్ పై క్లారిటీ ఇదే

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus