AR Rahman, Jr NTR: నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ కోసం బుచ్చిబాబు ప్రయత్నం

ఉప్పెన సినిమాతో భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు తన తదుపరి సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలి అని చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ మొదట ఈ దర్శకుడితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించకపోపోయినప్పటికీ ఆ తర్వాత అతని కాన్ఫిడెన్స్ చూసి సినిమాలు చేసేందుకు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తో కూడా జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న అనుబంధంతో ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పలేదు.

అంతే కాకుండా మధ్యలో సుకుమార్ కూడా జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడి ఆ ప్రాజెక్టును ఓకే చేయించినట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి. అయితే దర్శకుడు బుచ్చిబాబు సినిమాను పాన్ ఇండియా రేంజ్ లోనే తెరపైకి తీసుకు వచ్చే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే RRR సినిమా విడుదలకు సిద్ధం అవ్వగా ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే 30 ప్రాజెక్టు కూడా పాన్ ఇండియా కు తగ్గట్టుగానే తెరపైకి తీసుకు రాబోతున్నాడు.

బుచ్చిబాబు కూడా ఒక స్పోర్ట్స్ డ్రామా కథను పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే సెట్ చేసుకోవడం తో ఎన్టీఆర్ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం బుచ్చిబాబు ఏఆర్ రెహమాన్ ను సంగీత దర్శకుడిగా సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నాడట. మొదటి సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ ను సెలెక్ట్ చేసుకున్న బుచ్చిబాబు ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం మాత్రం రెహమాన్ వైపు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

సాధారణంగా సుకుమార్ తో పాటు ఆయన శిష్యులు కూడా ఎక్కువగా దేవి శ్రీ ప్రసాద్ తొంసినిమా చేస్తూ ఉంటారు. ఇక బుచ్చి బాబు కూడా మొదటి సినిమా కోసం దేవి శ్రీ ప్రసాద్ ను సెలెక్ట్ చేసుకొని మంచి మ్యూజిక్ ని కూడా రాబట్టుకొగలిగాడు.. ఇక ఇప్పుడు ఏ ఆర్ రెహమాన్ ను సెట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అంటే అతని ఆలోచన విధానం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus