Arbaaz Khan: ఇండస్ట్రీలో మరో పెళ్లి సందడి… రెండో పెళ్లి చేసుకున్న నటుడు… ఫొటోలు వైరల్‌.!

  • December 26, 2023 / 11:21 AM IST

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు, నటుడు అర్బాజ్‌ ఖాన్‌ వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లుగా ఓ యువతితో డేటింగ్‌లో ఉన్న అర్బాజ్‌ ఖాన్‌ ఎట్టకేలకు ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ మేరకు కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటికే అర్బాజ్‌కు నటి మలైకా అరోరాతో వివాహం అయ్యి… తర్వాత విడాకులు కూడా అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఆమె మేకప్‌ ఆర్టస్ట్ సురా ఖాన్‌.

అర్బాజ్‌ వివాహం అతని సోదరి అర్పితా ఇంట్లో సింపుల్‌గా జరిగింది. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వేడుకకు అర్బాజ్ సోదరులు సల్మాన్ ఖాన్‌, సోహైల్ ఖాన్‌, రవీనా టాండన్, జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ తదితరులు విచ్చేశారు. రవీనాకు మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేశారు సురా ఖాన్. ఇక అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా బాలీవుడ్ బెస్ట్ కపుల్‌గా చాలా ఏళ్లు ఉన్నారు. 19 ఏళ్లు కాపురం చేసిన ఈ జంట కొన్నేళ్ల క్రితం సడన్‌గా విడిపోయారు.

ఏమైంది అనే విషయం తెలియకుండానే ‘తాము విడిపోతున్నాం’ అంటూ 2016లో ప్రకటించారు. ఆ తర్వాత 2017లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ సురా ఖాన్‌కు అర్బాజ్ ఖాన్ దగ్గరయ్యాడు. అదే సమయంలో మలైకా అరోరా.. నటుడు అర్జున్‌ కపూర్‌కు దగ్గరయ్యారు. అర్బాజ్‌ (Arbaaz Khan) పెళ్లి అయిపోవడంతో ఇప్పుడు అందరి చూపు మలైకాపై పడింది.

కొన్నాళ్లపాటు సీక్రెట్‌గా సాగిన మలైకా – అర్జున్‌ డేటింగ్‌ కొన్ని రోజుల క్రితం అఫీషియల్‌ అయ్యింది. అయితే ఇప్పుడు ఇద్దరూ కలసి లేరు అనే వార్తలొచ్చాయి. మలైకా అరోరా – అర్జున్ కపూర్‌ మధ్య అభిప్రాయబేధాలు వచ్చినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసే ఉన్నారా? ఉంటే వారి పెళ్లి ఎప్పుడు అనేది లేటెస్ట్‌ చర్చ. మలైకా కంటే అర్జున్‌ 12 ఏళ్లు చిన్నవాడు అనే విషయం తెలిసిందే.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus