వేద అలియాస్ ఆర్చన.. ‘తపన’ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వెళ్లింది. మధ్యలో పెద్ద సినిమాల్లో నటించినా.. అవి చిన్న పాత్రలే. అయితే ఆమెకు పెద్ద సినిమాల్లో మంచి పాత్రలు రాలేదా? అంటే ఒకటి రెండు వచ్చాయి అనే సమాధానం వస్తుంది. అయితే అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ సినిమాల్లో నటించలేకపోయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని గృహిణిగా మారిపోయింది. ఆమె కెరీర్, లైఫ్ గురించి ఓ టీవీ షోలో చెప్పుకొచ్చింది అర్చన.
హెడ్డింగ్ పట్టుకొని వార్తలోపలకు వచ్చుంటారు కాబట్టి.. తొలుత ‘మగధీర’ గురించే మాట్లాడుకుందాం. ఆ సినిమాలో అర్చనకు ఓ మంచి పాత్ర ఆఫర్ చేశారట రాజమౌళి. అయితే అప్పుడు మెచ్యూరిటీ లేకపోవడం వల్ల సినిమాలో నటించలేదని అర్చన తెలిపింది. అయితే ఆ చిత్రంలో చేసుంటే బాగుండేదని ఫీలయ్యింది. ఇక రెండో మెయిన్ పాయింట్ అంటే ‘శ్రీరామదాసు’ సినిమా చిత్రీకరణ రోజుల గురించే చెప్పాలి. ఆ సినిమాలో సీత పాత్రలో నటించింది అర్చన. ఆ పాత్ర నటించడం తన అదృష్టమని చెప్పింది.
‘పాండురంగడు’ సినిమాలోని బృందావనంలో గోపికలతో డ్యాన్స్ చేసే చిన్న బిట్‌కి బాలకృష్ణకు డ్యాన్స్ చేసి చూపించానని, ఆయన ఆ డ్యాన్స్ చేశాను అని వివరించారు అర్చన. ఆ పాట తర్వాత బాలయ్య వచ్చి బాగా మెచ్చుకున్నారు అని చెప్పింది అచ్చన. ఇక తమ పెళ్లి వేదికను లాస్ట్ మినిట్‌లో ఛేంజ్ ఎందుకు చేశారు అనే విషయం కూడా చెప్పారు. అలాగే పార్టీకి వెళ్లినప్పుడు హెల్త్ ఇబ్బంది పడితే నేరుగా అక్కడి నుండే ఆస్పత్రికి వెళ్లిపోవడం లాంటి సరదా సంఘటలను కూడ వివరించింది అర్చన.
పెద్ద సినిమాల్లో నటించే అవకాశం వచ్చి, చివరి నిమిషంలో రద్దు అయిన సందర్భాలున్నాయా? అని అడిగితే అర్చన కన్నీటి పర్యంతమైంది. ఎందుకు అంతలా ఎమోషనల్ అయ్యింది అనేది వచ్చే సోమవారం తెలుస్తుంది. అన్నట్లు ఆమె నటించిన ‘10th క్లాస్ డైరీస్’ జులై 1న విడుదలవుతోంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!