Archana: అలా చూడటం నాకు అస్సలు నచ్చదన్న అర్చన!

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన అర్చన ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కెరీర్ బిగినింగ్ నుంచి నాకు చాలాసార్లు కోపమొచ్చిందని ప్రస్తుతం నచ్చకపోతే వెంటనే చెప్పేస్తున్నానని అర్చన అన్నారు. వచ్చిన సినిమాలను చేస్తూ ఉండాలనే ఆలోచనతో నేను సినిమాలు చేశానని ఆమె పేర్కొన్నారు. కన్నడలో నేను చేసిన అదినగళ్లు సినిమా భారీ హిట్ అయిందని ఆమె చెప్పుకొచ్చారు. నేను తెలుగమ్మాయనని నేను డ్యాన్స్ చేయగలనని భాష వచ్చని యాక్టింగ్ చేస్తాననే కాన్ఫిడెన్స్ ఉందని అనుకున్నానని ఆమె తెలిపారు.

అమ్మ నన్ను ఎంతో సపోర్ట్ చేసిందని కుటుంబమే నా స్ట్రెంత్ అని ఆమె చెప్పుకొచ్చారు. ఒక నిర్మాత పెళ్లైన తర్వాత అర్చనకు ఎందుకు ఇంత రెమ్యునరేషన్ ఇస్తున్నారని అన్నారని అర్చన కామెంట్లు చేశారు. ఇలా ఉండకూడదని నాకు అనిపిస్తుందని అర్చన చెప్పుకొచ్చారు. మేల్ డామినేషన్ ఉన్న సబెక్ట్స్ లో కూడా ఫిమేల్ కీలక పాత్ర పోషిస్తుందని అర్చన కామెంట్లు చేశారు. గత కొన్నేళ్లలో తెలుగులో చాలా మంచి సినిమాలు వచ్చాయని అర్చన తెలిపారు.

రంగస్థలం మూవీ నాకు చాలా నచ్చిందని ఆ సినిమాలో హీరోయిన్ కు కూడా మంచి పాత్ర దక్కిందని అర్చన చెప్పుకొచ్చారు. అత్తారింటికి దారేది సినిమాలో ఆడవాళ్లకు మంచి రోల్స్ లభించాయని అర్చన పేర్కొన్నారు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలలో చిన్న పాత్ర చేసినా ఆ పాత్రకు ప్రాధాన్యత ఉందని ఆమె తెలిపారు.

నన్ను మంచి యాక్టర్ గా చూస్తున్నారేమోనని ఆమె అన్నారు. సిల్లీ ఫెలోస్ ప్రతి చోట ఉంటారని వాళ్లకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకూడదని అర్చన చెప్పుకొచ్చారు. ఆడదాన్ని విక్టిమ్ గా మగవాడిని ఎంపవర్ స్టేట్ లో సొసైటీ చూస్తోందని నేనలా చూడనని అర్చన పేర్కొన్నారు. అర్చన వరుస ఆఫర్లతో బిజీ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus