వార్ 2కి పెట్టిన డబ్బులు రాబట్టుకోవడానికి చాలా చిన్న టికెట్ విండో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ యాక్టివ్ ప్రొడ్యూసర్ అంటే నాగవంశీ అనే చెప్పాలి. ఒకపక్క స్ట్రయిట్ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూనే, మరోపక్క డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. 2025లో ఆల్రెడీ 3 సినిమాలు రిలీజ్ చేసి, మరో మూడు సినిమాలు రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న నాగవంశీ ఇటీవల “వార్ 2” తెలుగు రైట్స్ ను అత్యధిక మొత్తం చెల్లించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ మీద అభిమానంతోనే లేక త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత కూడా తన భుజం మీద ఉండడం వల్లనో ఖర్చుకు వెనుకాడకుండా జీఎస్టీలు గట్రాలు కలుపుకొని దాదాపు 80 కోట్ల రూపాయలకి “వార్ 2” హక్కులు సొంతం చేసుకున్నాడు నాగవంశీ.
ఇక్కడ దాకా బానే ఉంది కానీ.. ఇప్పుడు అసలు సమస్య మొదలైంది. ఎందుకంటే.. వంశీ పెట్టిన డబ్బులు వెనక్కి రావాలంటే సినిమా కనీసం రెండు వారాలైనా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడడమే కాక, మరో రెండు వారాలు థియేటర్లలో నిలబడాలి.
ఆల్రెడీ కూలి ఎఫెక్ట్ కారణంగా ఫస్ట్ ఫీల్ కలెక్షన్స్ మీద భారీ ప్రభావం పడబోతోంది. అది సరిపోదన్నట్లు వంశీ ప్రొడ్యూస్ చేస్తున్న “మాస్ జాతర” ఆగస్ట్ 27 రిలీజ్ కి రంగం సిద్ధమైంది. నిజానికి “వార్ 2” కోసం ఆ సినిమాని పోస్ట్ పోన్ చేస్తారేమో అనుకున్నారు కానీ.. వంశీ మాత్రం ఇవాళ రిలీజైన టీజర్ తో మరోసారి ఆగస్ట్ 27 రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసారు. మరి ఈ రెండు వారాల్లో “వార్ 2” 80 కోట్ల షేర్ ను వసూలు చేసి వంశీకి లాభాలు తెచ్చిపెడుతుందా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. టికెట్ బుకింగ్స్ యాప్స్ లో కూడా “వార్ 2” ఎఫెక్ట్ పెద్దగా కనిపించడం లేదు. మరి వంశీ ఈ రిస్కీ ఫీట్ ను ఎలా అధిగమిస్తాడు అనేది చూడాలి.