Arhoi, Surya: ఆరోహి – సూర్య ఇద్దరి మద్యలో ఏముంది ? కంటెంట్ కోసమే చేస్తున్నారా..!

బిగ్ బాస్ హౌస్ లో హగ్గులు – కిస్సులు అనేవి చాలా కామన్ గా నడుస్తుంటాయి. ప్రతి సీజన్ లోనూ ఎవరో ఒకరిద్దరి మద్యలో ఈ కెమిస్ట్రీ నడవాల్సిందే. రేటింగ్ పండాల్సిందే. దీనిపైన ఎంతమంది ఎన్ని రకాలుగా కామెంట్స్ చేసినా కూడా బిగ్ బాస్ మాత్రం వీటినే హైలెట్ చేయడానికి చూస్తాడు. ఈసారి సీజన్ లో ఆరోహి – ఆర్జే సూర్య ఇద్దరి మద్యలో లవ్ ట్రాక్ ని ప్లాన్ చేశారా అనిపిస్తోంది. లాస్ట్ వీకండ్ నాగార్జున వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటో చూపించనప్పటి నుంచీ ఇద్దరూ హౌస్ లో రెచ్చిపోతున్నారు.

అయితే, కేవలం కంటెంట్ ఇవ్వడం కోసమే ఇలా చేస్తున్నారా ? లేదా నిజంగానే ఇద్దరిమద్యలో ఏమైనా ఉందా అనేది ఆడియన్స్ ని సందిగ్ధంలో పారేస్తోంది. గతవారం బిగ్ బాస్ స్టేజ్ దగ్గర ఉన్న ఆడియన్స్ నుంచీ కొంతమంది ఈ ప్రశ్నని వేశారు కూడా. అయితే, ఆరోహి మాత్రం మూడేళ్లనుంచీ ప్రేమ కలగలేదు, ఇప్పుడేం కలుగుతుంది అంటూ వ్యంగ్యాస్త్రం వేసింది. కానీ, బిగ్ బాస్ హౌస్ లో వీరి బిహేవియర్ మాత్రం చాలామందికి అనుమానాలు కలిగిస్తోంది. హౌస్ లోకి వెళ్లేముందు ఆరోహి ఇచ్చిన చాలా ఇంటర్య్వూలలో మగాళ్లని అస్సలు నమ్మనని చెప్పింది.

హౌస్ లోకి వచ్చిన కొద్దిరోజులకే ఆర్జే సూర్య కూడా నేను ఫెమినిస్ట్ అని, ఇంట్లో ఆడవాళ్లకి ఎలాంటి ఇబ్బందులు కలిగించనని చెప్పాడు. కానీ, సూర్య- ఆరోహిల రొమాన్స్ మాత్రం బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజుకీ ఎక్కువైపోతునే ఉంది. ఆడియన్స్ కి ఈ అనుమానం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి వీటిలో కొన్ని మనం చూసినట్లయితే., వచ్చిన మొదటిరోజుల్లోనే ఇద్దరూ ఒకరికి ఒకరు సపోర్ట్ చేస్కుంటూ ఉన్నారు. అంతేకాదు, క్లోజ్ గా కౌగిలించుకోవడం, దగ్గరదగ్గరగా కూర్చోవడం, ఒకరిని ఒకరు ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉండటం అనేది అనుమానాలని షురూ చేసింది.

టాస్క్ లలో కూడా ఆరోహికి దెబ్బ తగిలినపుడు సూర్య మోసుకుంటూ వెళ్లాడు. అలాగే, దగ్గరుండీ మరీ సేవలు చేశాడు. ఒకే టీకప్పులో టీ తాగడం, అన్నం ముద్దలు కలిపి తినిపించుకోవడం ఇవన్నీ వీరిమద్యలో అసలు ఏముందీ అనేది ఆరాలు తీసేలా చేసింది. ఆ తర్వాత ఆరోహి అలగడం, ఏడవడం, సూర్య వచ్చి బుజ్జగించడం సారీ చెప్పడం చేసేవాడు. దగ్గరగా తీసుకుని నుదుటిమీద ముద్దుపెట్టడం వరకూ వీరిద్దరి బాండింగ్ వచ్చింది. ఇక హౌస్ లో కొన్ని సంఘటనలు చాలా అనుమానాలకి దారితీసింది. ఆరోహి ఏడుస్తుంటే లగేజ్ రూమ్ లోకి వెళ్లిన సూర్య చాలాసేపు అక్కడ ఫన్ చేశాడు.

ఆరోహి మాత్రం ఖంగారు పడి గుద్దుకుంటున్నాడేమో అంటూ వచ్చి చూసింది. ఆ తర్వాత హగ్గులు కావాలి, ముద్దులు కావాలని సైగలు చేసుకునే వరకూ వచ్చింది వీళ్ల వ్యవహారం. అంతేకాదు, వేరేవాళ్లతో ఇద్దరిలో ఎవరు క్లోజ్ గా ఉన్నా ఇంకొకరు తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇక రీసంట్ గా జరిగిన ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే., ఎప్పటిలాగానే ఆరోహి ఇంకా సూర్య ఇద్దరూ కూడా హగ్స్ ఇచ్చుకుంటున్నారు. ఆ తర్వాత మంచంపై పడుకుని ఉన్న సూర్యతో ఎఫెక్షన్ గురించి ముచ్చట్లు పెట్టింది ఆరోహి. మిగతావాళ్ల కంటే కూడా నువ్వు చాలా స్పెషల్ అంటూ చెప్పింది.

ఇక అయిపోయిందిలే.. పెదాలతోనే ముద్దు కావాలా అన్నట్లుగా సైగ చేసింది. సిగ్నల్ ఇచ్చింది. వీళ్లిద్దరి మద్యలో జరిగిన ఈ వీడియో, వాష్ రూమ్ దగ్గర పడుకుని ఉన్న సూర్య ముఖంపై ఆరోహి చేతులు పెట్టి సరసాలు ఆడే వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు , ఇద్దరూ ఈ మద్య తెగ అలుగుతున్నారు. ఈ అలకలప్పుడు కూడా హగ్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం అనేది వీళ్లిద్దరి మద్యలో కామన్ గా మారిపోయింది. గత సీజన్స్ తో పోలిస్తో ఈ సీజన్ లో వీరిద్దరూ మసాలాని బాగానే పండిస్తున్నారు.

సీజన్ – 3లో మనం చూసినట్లయితే రాహుల్ – పునర్నవిల మద్యన లవ్ ట్రాక్ నడిచింది. అలాగే, సీజన్ -4లో మోనాల్ – అఖిల్ మద్యలో , సీజన్ 5లో సిరి ఇంకా షణ్ముక్ ల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈసీజన్ లో ఆర్జే సూర్య, ఆరోహి ఇద్దరూ ఈ లవ్ ట్రాక్ ని నడిపిస్తున్నారా అనిపిస్తోంది. ఇప్పుడు వీరిద్దరి మద్యలో జరిగే రొమాన్స్ , కెమిస్ట్రీ అన్నీ ప్రేక్షకులు బాగా ఫాలో అవుతున్నారు. మరి ఈ లవ్ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరం.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus