అలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తే ఇలాగే దెబ్బలు తగులుతాయి.. అరియనా వీడియో వైరల్!

అరియానా గ్లోరీ… అందరికీ సుపరిచితమే. కెరీర్ ప్రారంభంలో యూట్యూబ్ ఛానల్స్ కు సెలబ్రిటీ ఇంటర్వ్యూలు చేసి పాపులర్ అయ్యింది. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మతో చేసిన ఓ ఇంటర్వ్యూ ఈమెను ఓవర్ నైట్ స్టార్ ను చేసిందనే చెప్పాలి. ఆ ఇంటర్వ్యూ అంతా చాలా బోల్డ్ గా ఉంటుంది. ఆర్జీవీ – అరియానా ఇద్దరూ కూడా ఎక్కడా తగ్గకుండా ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఒక్క ఇంటర్వ్యూ వల్లనే అరియానాకి బిగ్ బాస్ ఛాన్స్ లభించింది. ఇక హౌస్ లో అరియాన గేమ్ ఆడిన తీరు కూడా అందరికీ నచ్చింది.

అందుకే ఈమె టాప్ 5లో నిలిచింది. ‘బిగ్ బాస్’ తర్వాత అరియానా రేంజ్ ఇంకా పెరిగింది. బుల్లితెర పై ఈమెకు బోలెడన్ని ఛాన్స్ లు వస్తున్నాయి. సినిమాల్లో కూడా నటిస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా అరియానా గాయపడింది. షూటింగ్ లో భాగంగా ఇలా జరిగిందని ఆమె తెలిపింది. అందుకు కారణం కూడా ముక్కు అవినాష్ అని తెలిపింది.

తన సోషల్ మీడియా ద్వారా అరియనా తన చేతికి తగిలిన గాయాన్ని చూపిస్తూ.. “మిస్టర్ ముక్కు అవినాష్ గారు చూడండి..డాన్స్ లో, పెర్ఫార్మెన్స్ లో పక్కన ఉన్న ఆర్టిస్టులను పట్టించుకోకుండా.. మీ హండ్రెడ్ పర్సెంట్ డెడికేషన్ తో పెర్ఫార్మ్ చేస్తే అవతలి వాళ్ళు ఎలా బలవుతారో.. బీబీ జోడిలో చేసిన పెర్ఫార్మెన్స్ కి నా చెయ్యి చూడండి… ఇలా దెబ్బ తగిలి కమిలిపోయింది. దీన్ని నేను ఖండిస్తున్నాను అవినాష్ గారు” అంటూ సరదాగా స్పందించింది అరియాన. ఆమె పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus