బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో కీలుగుర్రం కెప్టెన్సీ టాస్క్ అనేది హౌస్ మేట్స్ మద్యలో చిచ్చుపెట్టింది. చెక్క గుర్రంపై నుంచీ పోటీదారులు దిగేందుకు , వారిని దింపేందుకు హౌస్ మేట్స్ చాలా కష్టపడ్డారు. లాజిక్స్ వర్కౌట్ చేస్తూ వాళ్లు చేసిన తప్పులని చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాదు, ఇక్కడే యాంకర్ శివని గుర్రం పై నుంచీ దింపేందుకు అఖిల్ అండ్ ఫ్రెండ్స్ టీమ్ ప్రయత్నం చేసింది. అజయ్ ని ఎలాగైనా కెప్టెన్ చేయాలని ఉద్దేశ్యంతో డిబేట్ చేశారు.
వీళ్లకి సాలిడ్ గా సమాధానం చెప్తూ బిందుమాధవి రచ్చ రచ్చ చేసింది. ముఖ్యంగా అఖిల్ కి మాటకి మాట చెప్పింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇద్దరూ వాదించుకున్నారు. దీంతో హౌస్ వేడెక్కిపోయింది. కెప్టెన్సీ టాస్క్ లో ఇలా ఆర్గ్యూమెంట్ చేస్తూ గొడవ పెట్టడంలో అరియానా కీలకపాత్ర పోషించిందనే చెప్పాలి. బిగ్ బాస్ నాలుగోవారం కెప్టెన్సీ లో అరియానా నటరాజ్ మాస్టర్ తో డీల్ మాట్లాడుకుంది. రెండో రోజు టాస్క్ ప్రారంభం కంటే ముందే మాస్టర్ మీరు కెప్టెన్ అయితే నాకు ఏం చేస్తారు. ? నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అడిగింది.
అంతేకాదు, ఈవారం అంతా మీకు నేను అసిస్టెంట్ గా ఉంటాను అని పని ఏమీ చేయను అంటూ చెప్పింది. దీనికి నటరాజ్ మాస్టర్ ఓకే చెప్పారు. అంతేకాదు, సంచాలక్ గా నిర్ణయం తన చేతుల్లో ఉంటుందని కూడా గుర్తు చేసింది. ఫైనల్ గా నా డెసీషన్ పైనే ఆధారపడి ఉంటుందని క్లియర్ గా హౌస్ మేట్స్ కి సైతం చెప్తూ వచ్చింది. నటరాజ్ మాస్టర్ , ఇంకా యాంకర్ శివ ఇద్దరి మద్యలో పోటీ ఉన్నప్పుడు లాజికల్ గా శివని కిందకి దింపేసింది అరియానా. చాలా తెలివిగా హౌస్ మేట్స్ మెజారిటీ ఓటింగ్ ని కన్సిడర్ చేస్తూ హౌస్ మేట్స్ నిర్ణయం అని చెప్పి, అలాగే నా నిర్ణయం కూడా ఇదే అని చెప్తూ మాస్టర్ ని కెప్టెన్ ని చేసింది.
ముందుగానే మాస్టర్ కి హౌస్ సపోర్ట్ ఉంటుందని గ్రహించింది అరియానా. అందుకే నటరాజ్ మాస్టర్ తో టాస్క్ కంటే ముందే డీల్ మాట్లాడేసుకుంది. అందుకే కావాలనే శివని గుర్రం పై నుంచీ దింపేసి మరోసారి శివని కెప్టెన్ కాకుండా చేసింది. టాస్క్ పూర్తి అయిన తర్వాత శివతో కారణాలు చెప్తూ తన తప్పు ఏమీ లేదని చెప్పే ప్రయత్నం చేసింది. ఇక శివ కూడా అరియానా చెప్పిన రీజన్ ని స్వాగతించాడు.