Ariyana, Ashu Reddy: అరియానాకి – అషూకి ఆ విషయంలోనే పెద్ద గొడవ అయ్యిందా?

బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన అషూ ఇంకా అరియానా ఇద్దరూ గతవారం నుంచీ ఎడముఖం, పెడముఖంగా ఉన్నారు. ఐధువారాల పాటుగా చక్కగా కలిసిమెలిసి ఉన్న ఇద్దరూ గతవారం నుంచీ బద్ద శత్రువులు అయిపోయారు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అషూరెడ్డి కెప్టెన్సీ అప్పుడు కూడా అరియానా చాలా సంబరపడింది. అషూ కెప్టెన్ అవ్వగానే వెళ్లి కౌగిలించుకుంది. అక్కడితో సమస్య తీరిపోయిందనే అనుకున్నారు అందరూ. ఆ తర్వాత అరియానా రేషన్ మేనేజర్ గా కూడా అయ్యింది.

Click Here To Watch NOW

కానీ, టాస్క్ లో జరిగిన సంఘటన వల్ల అరియానా అషూపై ఇంకా ద్వేషం పెంచుకుంది. నిజానికి రోబో టాస్క్ అప్పుడే ఇద్దరికీ పడలేదు. ఆ తర్వాత అషూ కెప్టెన్సీ పోటీదారులు అవ్వడం, టాస్క్ గెలవడంతో అరియానా సంతోషించింది. కానీ, ఆ తర్వాత మాటలతో అషూరెడ్డి ఏదో ఒకటి అనడం, అరియానా ఇరిటేట్ అవ్వడం జరుగుతూనే ఉంది. ఇద్దరి మద్యలో కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయ్యింది. వరెస్ట్ పెర్ఫామర్ ని ఎంచుకోమని బిగ్ బాస్ హౌస్ లో చెప్పమన్నప్పుడు అరియానా అషూపై ఉన్న పాయింట్స్ అన్నీ చెప్పే ప్రయత్నం చేసింది.

ఇక్కడే మటన్ గురించి ప్రస్తావన వచ్చింది. అసలు ఏం జరిగిందంటే., మటన్ చేసుకుందామని అఖిల్ అడిగినపుడు మటన్ పాడైపోయిందని చెప్పింది అషూ. దీనికి కారణం రేషన్ మేనేజర్ అంటూ మాట్లాడింది. అరియానా ఫ్రిజ్ లో పెట్టలేదని, అలాగే ఉంచేసరికి అది పాడైపోయిందని చెప్పింది. రేషన్ మేనేజర్ గా తనకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అంటూ మాట్లాడింది. అయితే, ఇక్కడే అషూరెడ్డి కెప్టెన్ కాబట్టి తన బాధ్యత కూడా ఉండాలని అరియానా వాదించింది.

మటన్ తనవల్లే పాడైపోయిందని ఒప్పుకుంటూనే బాధ్యత మొత్తం తనకి కాదని చెప్పుకొచ్చింది. అరియానా మటన్ పైడు చేసిన సంగతి హౌస్ మేట్స్ అందరికీ తెలిసింది. టాస్క్ గోలలో పడిపోయి రేషన్ ని గాలికి వదిలేసింది. దీంతో అషూరెడ్డి ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. ఇక టాస్క్ లో అరియానా – అజయ్ ఇద్దరూ కలిసి గేమ్ ఆడారు. అక్కడ కూడా అషూరెడ్డి తో వాగ్వివాదం పెట్టుకున్నారు. అషూరెడ్డి తీస్కున్న నిర్ణయం వాళ్లకి నచ్చలేదు.

అలాగే, గేమ్ లో నీ సొంత రూల్స్ ఎలా పెడతావ్ అంటూ ఆర్గ్యూ చేశారు. ఈవారం అంతూ అషూరెడ్డిపై అసహనంగానే ఉంది అరియానా. మరి వీకండ్ వీరిద్దరి విషయంలో నాగార్జున ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus