అబ్బాయిల గురించి కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడు.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో భగవంత్ కేసరి (Bhagavath Kesari) సినిమా సక్సెస్ తో అర్జున్ రాంపాల్ ఓవర్ నైట్ లో పాపులర్ అయ్యారు. భగవంత్ కేసరి సినిమాలో ఆయనకు స్క్రీన్ స్పేస్ ఎక్కువగానే దక్కగా ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారనే సంగతి తెలిసిందే. ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొన్న అర్జున్ రాంపాల్ (Arjun Rampal) మెహర్ జెసియాతో వైవాహిక బంధానికి స్వస్తి పలకడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 24 సంవత్సరాల వయస్సులోనే నేను మెహర్ జెసియాను మ్యారేజ్ చేసుకున్నానని ఆయన అన్నారు.

నాకు తెలిసినంత వరకు చిన్న వయస్సులోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టానని ఆయన తెలిపారు. పెళ్లికి ముందు ఎన్నో విషయాలను నేర్చుకోవాల్సి ఉంటుందని ఒక వ్యక్తిగా పరిణతి చెందాలని అర్జున్ రాంపాల్ తెలిపారు. అమ్మాయిల కంటే అబ్బాయిలు నెమ్మదిగా పరిణితి చెందుతారని ఆయన చెప్పుకొచ్చారు. అబ్బాయిలు ఇడియట్స్ అని ఇక్కడే తెలిసిపోతుందని ఆయన తెలిపారు. అబ్బాయిలు వైవాహిక బంధంలో సక్సెస్ కావాలని భావిస్తే చిన్న వయస్సులో మ్యారేజ్ రిలేషన్ లోకి వెళ్లొద్దని అర్జున్ రాంపాల్ కామెంట్లు చేశారు.

మెహర్ తో విడాకులు మా పిల్లలను ఎంతో బాధించాయని ఆయన అన్నారు. ఆ సమయంలో వారు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారని అర్జున్ రాంపాల్ పేర్కొన్నారు. పెళ్లి తర్వాత తమ లైఫ్ లో కొన్ని తప్పులు జరిగాయని వాటికి పూర్తి బాధ్యత తమదేనని ఆయన అన్నారు. విడాకులు తీసుకున్నా మెహర్ తో నాకు మంచి అనుబంధం ఉందని అర్జున్ రాంపాల్ వెల్లడించారు.

ప్రియురాలు గాబ్రియెల్లా గురించి మాట్లాడుతూ దేవుడు నాకు ఇచ్చిన సెకండ్ ఛాన్స్ ఇది అని అర్జున్ రాంపాల్ తెలిపారు. గాబ్రియెల్లా నన్నెంతో ప్రేమిస్తోందని మా మనసులు ఎప్పుడో కలిశాయని ఆ విధంగా మాకు పెళ్లి జరిగిందని నమ్ముతున్నానని అర్జున్ రాంపాల్ తెలిపారు. అర్జున్ రాంపాల్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus