‘బింబిసార’ (Bimbisara) తర్వాత కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) మార్కెట్ పెరిగింది. కానీ ఆ తర్వాత వచ్చిన ‘అమిగోస్’ (Amigos) ‘డెవిల్’ (Devil) వంటివి నిరాశపరిచాయి. 2024 లో కళ్యాణ్ రామ్ నుండి మరో సినిమా రాలేదు. మొత్తానికి ఇప్పుడు ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టైటిల్ తోనే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. మాస్ ఆడియన్స్ ని మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించే విధంగా కూడా టైటిల్ ఉంది.
ఇక లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (Vijaya Shanthi) కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే టీజర్లో కూడా ఆమె క్యారెక్టర్ ను బాగా హైలెట్ చేశారు. టీజర్ కూడా బాగుంది. శ్రీకాంత్ (Srikanth) , బబ్లూ పృథ్వీరాజ్ (Babloo Prithiveeraj) వంటి స్టార్ క్యాస్టింగ్ కూడా సినిమాలో ఉంది. సో వీటి కాలిక్యులేషన్స్ వల్ల సినిమాకి మంచి బిజినెస్ బాగా జరుగుతుంది. థియేట్రికల్ రైట్స్ కూడా మంచి రేటుకి అమ్ముడుపోతున్నాయి అని ట్రేడ్ పండితుల సమాచారం.
ఇప్పటికే ఆంధ్ర, సీడెడ్ రైట్స్ రూపంలో రూ.12 కోట్లు, రూ.3.70 కోట్లు వచ్చాయి. అలాగే ఓటీటీ, హిందీ డబ్బింగ్, శాటిలైట్ వంటి రైట్స్ కి కూడా మంచి రేట్లు వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు దాదాపు రూ.45 కోట్ల వరకు బడ్జెట్ పెట్టినట్టు టాక్. ఆ మొత్తాన్ని రిలీజ్ కి ముందే రికవరీ చేసినట్లు తెలుస్తుంది. అయితే రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడు ఈ సినిమాకి (Arjun Son Of Vyjayanthi) ఉన్న బజ్ కి మంచి రిలీజ్ డేట్ కూడా తోడైతే పాజిటివ్ రిజల్ట్ గ్యారెంటీ అని చెప్పొచ్చు.