ఆలస్యంగా విడుదలైనప్పటికీ.. ‘అర్జున్ సురవరం’ మంచి టైంలోనే విడుదలయ్యిందని చెప్పాలి. చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేకపోవడం.. డీసెంట్ టాక్ రావడం.. ‘అర్జున్ సురవరం’ చిత్రానికి ప్లస్ అయ్యింది. నవంబర్ 29న విడుదలయిన ఈ చిత్రం ఇప్పటికీ మంచి కలెక్షన్లు రాబడుతోంది. నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ చిత్రాన్ని టి.సంతోష్ డైరెక్ట్ చేసాడు. రాజ్ కుమార్ ఆకెళ్ళ నిర్మించగా… ‘ఠాగూర్’ మధు సమర్పకుడిగా వ్యవహరించాడు. ‘పేక్ సర్టిఫికేట్ ల వల్ల.. ఎంతో ట్యాలెంట్ ఉన్న కొందరి యువత భవిష్యత్తు నాశనమైతోందని.. ఆ ‘ఫేక్ సర్టిఫికేట్ మాఫియాని అంతం చేయడానికి ఓ జర్నలిస్ట్ ఎలాంటి స్టెప్ తీసుకున్నాడు’ అనే కధాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఇక ఈ చిత్రం 10 రోజుల ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 1.95 cr |
సీడెడ్ | 0.81 cr |
ఉత్తరాంధ్ర | 0.92 cr |
ఈస్ట్ | 0.58 cr |
వెస్ట్ | 0.45 cr |
కృష్ణా | 0.59 cr |
గుంటూరు | 0.72 cr |
నెల్లూరు | 0.37 cr |
ఏపీ + తెలంగాణ | 6.39 cr(share) |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.29 cr |
ఓవర్సీస్ | 0.58 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 7.26 cr (share) |
‘అర్జున్ సురవరం’ చిత్రానికి 5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కొన్ని ఏరియాల్లో నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారని సమాచారం. ఇక 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 7.26 కోట్ల షేర్ ను రాబట్టింది. రెండో వీకెండ్ ను కూడా ఈ చిత్రం బాగా క్యాష్ చేసుకుందనే చెప్పాలి. ఇప్పటికే బయ్యర్స్ అంతా లాభాల బాట పట్టరాని ట్రేడ్ పండితుల సమాచారం. మొత్తానికి నిఖిల్ అకౌంట్ లో మరో హిట్ పడిందని చెప్పొచ్చు.
24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!