‘అర్జున్ సురవరం’ 17 డేస్ కలెక్షన్స్..!

  • December 16, 2019 / 04:19 PM IST

ఎప్పటి నుండో విడుదల వాయిదా పడుతూ వచ్చిన.. ‘అర్జున్ సురవరం’ చిత్రం.. ఎట్టకేలకు నవంబర్ 29న విడుదలై డీసెంట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు మంచి కలెక్షన్లను సాధిస్తోంది. నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ చిత్రాన్ని టి.సంతోష్ డైరెక్ట్ చేసాడు. రాజ్ కుమార్ ఆకెళ్ళ నిర్మించగా… ‘ఠాగూర్’ మధు సమర్పకుడిగా వ్యవహరించాడు. ‘పేక్ సర్టిఫికేట్ ల వల్ల.. ఎంతో ట్యాలెంట్ ఉన్న కొందరి యువత భవిష్యత్తు నాశనమైతోందని.. ఆ ‘ఫేక్ సర్టిఫికేట్ మాఫియాని అంతం చేయడానికి ఓ జర్నలిస్ట్ ఎలాంటి స్టెప్ తీసుకున్నాడు’ అనే కధాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఇక ఈ చిత్రం 17 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 3.6 cr (corrected)
సీడెడ్ 0.91 cr
ఉత్తరాంధ్ర 1.01 cr
ఈస్ట్ 0.62 cr
వెస్ట్ 0.50 cr
కృష్ణా 0.66 cr
గుంటూరు 0.80 cr
నెల్లూరు 0.40 cr
ఏపీ + తెలంగాణ 8.50 cr(share)
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.60 cr (corrected)
ఓవర్సీస్ 0.60 cr
టోటల్ వరల్డ్ వైడ్ 9.71 cr (share)

‘అర్జున్ సురవరం’ చిత్రానికి 5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అయితే కొన్ని ఏరియాల్లో.. నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక 17 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 9.71 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓన్ రిలీజ్ చేసుకున్న నిర్మాతలు కూడా సేఫ్ అయిపోయినట్టు సమాచారం. ఇక బయ్యర్స్ అంతా కూడా ఎప్పుడో లాభాల బాట పట్టారు. నైజాం ఏరియాలో ఇప్పటికి ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్లను రాబడుతుంది. ప్రస్తుతానికి బ్లాక్ బస్టర్ లిస్ట్ లో ప్లేస్ సంపాదించుకున్న ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసేసరికి ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి..!

Click Here For Arjun Suravaram Movie Review

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus