Pushpa Movie: ‘పుష్ప’ షూటింగ్‌ ఇలాంటి పరిస్థితుల్లో జరిగిందా!

‘పుష్ప’ సినిమా గురించి చర్చ వస్తే… హీరో, డైరక్టర్‌, మ్యూజిక్‌ డైరక్టర్‌తోపాటు కచ్చితంగా ప్రొడక్షన్‌ డిజైనర్ల గురించి మాట్లాడుకోవాలి. సినిమాకు కొత్త లుక్‌ తీసుకొచ్చి, మనకు ‘పుష్ప’రాజ్‌ లోకం చూపించడానికి వాళ్లు చాలా కష్టపడ్డారనే చెప్పాలి. శేషాచలం అడవుల్ని… మారేడుమిల్లిలో చూపించి మెప్పించాలంటే వాళ్లు ఎంత కష్టపడకపోతే జరుగుతుంది చెప్పండి. అయితే ఇదంతా మన మాటల్లో… సినిమా గురించి వాళ్లు ఎంత కష్టపడ్డారో కూడా తెలుసుకోవాలి కదా. ఆ ప్రయత్నమే ఇది. ఒకసారి వాళ్లను కదిపితే మూడేళ్ల కష్టం గురించి చెప్పుకొచ్చారు.

వారి మాటల్లోనే చదివేయండి! ‘పుష్ప’ కోసం తొలుత కేరళ, తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారట. సినిమా కథకు, నేపథ్యాన్ని ఏ ప్రాంతం అనువుగా ఉంటుందో చూశారట. ఈ క్రమంలో మారేడుమిల్లి వెళ్లారట. అక్కడ పరిస్థితులు చూసి వావ్‌ అనుకున్నారట సుకుమార్‌ అండ్‌ టీమ్‌. దీంతో మోనిక, రామకృష్ణ పని మొదలైంది. అదేనండి ప్రొడక్షన్‌ డిజైనర్ల పని మొదలైంది. అయితే కథకు తగ్గట్టుగా ఎర్రచందనం చెట్లు అక్కడ ఉండవు.

దీంతో ఎర్రచందనం కృత్రిమ చెట్లనీ, చిన్నపాటి కొండల్ని సృష్టించారట. రెండేళ్లు చిత్రీకరణ సాగితే… అంతకుముందు ప్రీ ప్రొడక్షన్‌ పనుల కోసం ఒక సంవత్సరం పని చేశారట. అలా మొత్తంగా మూడేళ్లు అక్కడే ఉన్నారట.సినిమా కోసం ఫోమ్‌, ఫైబర్‌ కలిపి కృత్రిమంగా ఎర్రచందనం దుంగలు తయారు చేశారట. ఏకంగా వాటి కోసం చిన్నపాటి ఫ్యాక్టరీయే రెడీ చేశారట. వాటితో కేరళలో షూటింగ్‌ చేసి తిరిగి వస్తుంటే… పోలీసులు పట్టుకున్నారట. అవి ఎర్రచందనం దుంగలు కావని ఎంత చెప్పినా వినలేదట.

దీంతో వాటిని విరగొట్టి…పోలీసులకు చూపించారట. వివరంగా వాటి గురించి చెబితే అప్పుడు పోలీసులు ఓకే అయ్యారట. అలాగే ఓసారి సినిమా షూటింగ్‌లో అల్లు అర్జున్‌ ఓ కొండ దగ్గరకు వెళ్లి కూర్చోబోయాడట. అయితే వెంటనే ప్రొడక్షన్‌ టీమ్‌ వచ్చి అది నిజం కొండ కాదని చెప్పారంట. దీంతో బన్నీ… ‘ఇక్కడ ఏది నిజమో చెప్పండి బాబూ’ అని అన్నారట. అలా ‘పుష్ప’ కోసం ఏకంగా కొత్త లోకమే సృష్టించాం అని చెప్పారు మోనిక, రామకృష్ణ. మరి ఈ లోకం ప్రేక్షకుల్ని ఎలా అలరిస్తుందో చూడాలి.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus