Kavya, Balakrishna: ఆ ముగ్గురు హీరోలంటే ఇష్టమంటున్న గంగోత్రి చైల్డ్ ఆర్టిస్ట్!

గంగోత్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కావ్య తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. కావ్య మసూద సినిమాలో హీరోయిన్ గా నటించగా త్వరలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అలీతో సరదాగా షోకు హాజరైన కావ్య మాట్లాడుతూ మసూద అనే పదం ఉర్దూ పదం అని మసూద అంటే మంచి మహిళ అని అర్థం వస్తుందని చెప్పుకొచ్చారు.

నాది ఖమ్మం జిల్లా కొత్తగూడెం అని మంచి కథ అనిపించి మసూద సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని ఆమె చెప్పుకొచ్చారు. చిన్నప్పుడు ఏం చేసినా క్యూట్ గా ఉంటుందని ఇప్పుడు అలా కాదని ఆమె అన్నారు. అయితే బాగా చేయాలనే పట్టుదల మాత్రం ఉంటుందని ఆమె కామెంట్లు చేశారు. చిన్నప్పుడు పరీక్షలు మానేసి నేను షూటింగ్ కు వెళ్లిన సందర్భాలు సైతం ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చదువుపై శ్రద్ధ పెట్టి 12 సంవత్సరాల పాటు యాక్టింగ్ కు దూరంగా ఉన్నానని ఆమె అన్నారు.

కరోనా సమయంలో సినిమాలు చేయాలనే ఆలోచన వచ్చి మసూద సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని ఆమె తెలిపారు. నాకు మణిరత్నం, సుకుమార్ డైరెక్షన్ లో నటించాలని ఉందని ఆమె కామెంట్లు చేశారు. తారక్, బన్నీ, నాగచైతన్యలకు హీరోయిన్ గా చేస్తే బాగుంటుందని ఆమె వెల్లడించారు.

బాలకృష్ణ, బన్నీ నేను పెద్దైన తర్వాత తమకు హీరోయిన్ గా చేయాలని అన్నారని కావ్య తెలిపారు. మా నాన్నతో శ్రీదేవి కూతురిగా యాక్ట్ చేసి ఆ తర్వాత హీరోయిన్ గా చేసిందని నాతో కూడా చేయాలని బాలయ్య అన్నారని కావ్య చెప్పుకొచ్చారు. నేను హీరోయిన్ అయ్యే సమయానికి బన్నీ, బాలయ్య లెజెండ్ లా ఉంటారని తెలిస్తే అప్పట్లోనే అగ్రిమెంట్ చేసుకునేదానినని కావ్య పేర్కొన్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus