కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కొన్ని సినిమా పేర్లు చెప్పగానే ఆ చైల్డ్ ఆర్టిస్ట్ లే గుర్తు వచ్చేంతగా వాళ్ళు పెర్ఫార్మ్ చేశారు అనడంలో అతిశయోక్తి లేదు. ‘ఇంద్ర’ సినిమా చెప్పగానే అందరికీ తేజ సజ్జ గుర్తుకొస్తాడు. అలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు.
‘అరుంధతి’ లో అనుష్క చిన్నప్పటి పాత్ర పోషించిన పాప అందరికీ గుర్తుండే ఉంటుంది.ఆమె పేరు దివ్య నగేష్. అరుంధతి చిత్రానికి గాను ఆమె ఉత్తమ బాలనటి కేటగిరిలో నంది అవార్డు అందుకుంది. అపరిచితుడు, సింగం పులి వంటి సినిమాల్లో కూడా ఆమె నటించి పాపులర్ అయ్యింది. అటు తర్వాత కూడా పలు సినిమాల్లో నటించింది కానీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. దీంతో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది దివ్య. కొన్నేళ్ల నుండి తన కో ఆర్టిస్ట్ కమ్ కొరియోగ్రాఫర్ అజయ్ కుమార్ తో ప్రేమాయణం నడుపుతుంది ఈ అమ్మడు.
2025 ఆరంభంలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఇక ఈ సోమవారం అంటే ఆగస్టు 18న దివ్య- అజయ్ కుమార్ ల పెళ్లి ఘనంగా జరిగింది. కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. తమ పెళ్లి ఫోటోలను దివ్య సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. వీరి పెళ్లి ఫోటోలు చూసిన వాళ్ళు తమ బెస్ట్ విషెస్ ను చెబుతూ కంగ్రాట్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.