రజినీకాంత్, కింగ్ నాగార్జున, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందిన ‘కూలీ’ జెండా పండుగ సందర్భంగా ఆగస్టు 14న రిలీజ్ అయ్యింది. ఆమిర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. సో ‘విక్రమ్’ ని మించి ‘కూలీ’ సూపర్ హిట్ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.
లోకేష్ కనగరాజ్ సినిమాలకు ఉన్న హైప్ కారణంగా మొదటి వీకెండ్ ను సూపర్ గా క్యాష్ చేసుకుంది ఈ సినిమా. వీక్ డేస్ లో కూడా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ ఆశించిన రేంజ్లో అయితే కాదు అనే చెప్పాలి. ఒకసారి ‘కూలీ’ 6 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 14.07 cr |
సీడెడ్ | 5.73 cr |
ఉత్తరాంధ్ర | 4.85 cr |
ఈస్ట్ | 2.58 cr |
వెస్ట్ | 2.13 cr |
గుంటూరు | 2.67 cr |
కృష్ణా | 2.44 cr |
నెల్లూరు | 1.43 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 35.9 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్) | 2.35 cr |
ఓవర్సీస్(తెలుగు వెర్షన్) | 3.06 cr |
టోటల్ వరల్డ్ వైడ్(తెలుగు వెర్షన్) | 41.31(షేర్) |
‘కూలీ'(తెలుగు వెర్షన్) చిత్రానికి రూ.46.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.47 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ చిత్రం రూ.41.31 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.71.7 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో 5.69 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.