Rajamouli: పరిస్థితికి జక్కన్న తలొంచాల్సిందేనా?

  • December 29, 2021 / 05:04 PM IST

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను వచ్చే ఏడాది జనవరి నెల 7వ తేదీన ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలో రిలీజ్ చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు సరిగ్గా వారం రోజుల గ్యాప్ ఉండగా థియేటర్లు మూసేస్తే మాత్రం ఈ సినిమాకు ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. ఢిల్లీ సర్కార్ ఎల్లో అలర్ట్ ను ప్రకటించి స్కూల్స్, థియేటర్లను మూసివేస్తున్నట్టు ఇప్పటికే వెల్లడించింది. బాహుబలి2 కలెక్షన్లను ఆర్ఆర్ఆర్ మూవీతో తిరగరాయాలని భావిస్తున్న రాజమౌళికి అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మరోవైపు ఓవర్సీస్ లో ఈ సినిమాకు ఊహించని స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ తొలిరోజు కలెక్షన్లు 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండే అవకాశం అయితే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ మేకర్స్ అన్ని రాష్ట్రాల్లో ప్రచారం విషయంలో స్పీడ్ పెంచారు. అయితే పరిస్థితి చేయి జారితే జక్కన్న ఏం చేస్తారనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రాజమౌళి, దానయ్యలకు ఆర్ఆర్ఆర్ మూవీ విషయంలో ఉన్న టెన్షన్ అంతాఇంతా కాదు.

యూరోప్ దేశాలలో లాక్ డౌన్ అమలవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ బాహుబలి2 సినిమాను మించి కలెక్షన్లను సాధించడం తేలిక కాదు. ఢిల్లీ బాటలో మరిన్ని రాష్ట్రాలు నడిస్తే రాజమౌళి ఏం చేస్తారో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ ను అనుకున్న తేదీకి విడుదల చేసినా కలెక్షన్ల విషయంలో పరిస్థితికి జక్కన్న తలొంచాల్సిందేననే కామెంట్లు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తమ కెరీర్ కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. దాదాపుగా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ విడుదలైన

తర్వాత ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. రాజమౌళి సినిమాలలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కాలేదు. ఆర్ఆర్ఆర్ సినిమా కూడా అంచనాలను మించి విజయం సాధిస్తుందని చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus