Ashika Ranganath: మరో పెద్ద సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆషికా రంగనాథ్!

ఆషికా రంగ‌నాథ్ ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న బ్యూటీ. 2023 లో వచ్చిన కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా ఈమె లుక్స్ కు మంచి మార్కులే పడ్డాయి. ‘ఎన్నో రాత్రులొస్తాయి’ అనే రీమిక్స్ పాటలో ఈమె గ్లామర్ ప్రియులను ఫిదా చేసింది అనే చెప్పాలి. దీంతో నాగార్జున నటించిన ‘నా సామి రంగ’ సినిమాలో ఈమెకు ఛాన్స్ లభించింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాలో వరాలు అనే మిడిల్ ఏజ్డ్ రోల్లో చాలా బాగా నటించింది.

సీనియర్ హీరోల సరసన అనుష్క, నయనతార.. మాత్రమే సెట్ అవుతారు అనే అభిప్రాయాన్ని కూడా ఈమె మార్చేసింది. అందుకే ఇప్పుడు ఏకంగా చిరు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుకి జోడీగా ఆల్రెడీ త్రిష ఎంపికైంది. షూటింగ్లో కూడా పాల్గొంటుంది.

అయితే కథ ప్రకారం.. ఈ సినిమాలో చిరుకి ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఉంటారట.ఆ పాత్రలకి సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉంటుందట. అందులో ఓ పాత్ర కోసం ఆషికా రంగనాథ్ ను సంప్రదించినట్లు సమాచారం. తెలుగులో ప్రస్తుతం ఆమెకు పెద్దగా ఆఫర్లు ఏమీ లేవు. పాత్రకి వెయిటేజీ ఉంది కాబట్టి.. ఆమె (Ashika Ranganath) కూడా పాజిటివ్ గా రెస్పాన్స్ ఇచ్చినట్లు సమాచారం.

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus