AVAK Collections: ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలింది..!

విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రం మే 6న విడుదల అయ్యింది. ఓ పాట హిట్ అవ్వడం, ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడం.. వీటన్నిటికీ తోడు ఇటీవల ఓ న్యూస్ ఛానల్ లో హీరో విశ్వక్ సేన్, ఓ యాంకర్ కు మధ్య జరిగిన మాటల యుద్ధం.. దాని వల్ల ఏర్పడిన కాంట్రవర్సీ వల్ల ఈ మూవీకి బాగా పబ్లిసిటీ జరిగింది. అల్లం అర్జున్ ప్రసాద్ అనే పాత్రలో విశ్వక్ సేన్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించాడు.

33 ఏళ్ళు వచ్చినా పెళ్లి కానీ యువకుడిలా అతను ఆ పాత్రకి జీవం పోసాడు. రుక్సర్ ధిల్లాన్ అతనికి జోడీగా నటించింది.మొదటి షోతోనే ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది.ఫస్ట్ వీకెండ్ ఈ మూవీ బాగానే క్యాష్ చేసుకుంది.వీక్ డేస్ లో కూడా డీసెంట్ గా అనిపించింది.కానీ ‘సర్కారు వారి పాట’ ‘డాన్’ వంటి చిత్రాలు పుంజుకోవడంతో ఈ మూవీ సైలెంట్ అయిపోయింది. ఒకసారి ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 1.72 cr
సీడెడ్ 0.48 cr
ఉత్తరాంధ్ర 0.42 cr
ఈస్ట్ 0.25 cr
వెస్ట్ 0.21 cr
గుంటూరు 0.28 cr
కృష్ణా 0.25 cr
నెల్లూరు 0.16 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.77 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.22 cr
ఓవర్సీస్ 0.48 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 4.47 cr

‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రానికి రూ.5.96 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.4.47 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దాంతో రూ.1.53 కోట్ల నష్టాలతో ఈ మూవీ కమర్షియల్ ఫెయిల్యూర్ మిగిలింది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus