Ashu Reddy: బద్ద శత్రువులు కలిసి గేమ్ ఆడారు..! టాస్క్ లో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ ముక్కలైంది. ఒక్కో ఏరియాని ఒక్కొక్కరు టాస్క్ రూపంలో పంచుకున్నారు. హౌస్ లో ఒక ఏరియాని యాక్సెస్ చేసుకోవాలంటే పాస్ లని వాడుకోవాలి. కానీ, హౌస్ మేట్స్ పాస్ లని వాడుకోకుండా డీల్స్ సెట్ చేసుకోవడంలోనే ఎక్కువ శ్రద్ధ చూపించారు. నిజానికి ఈ విషయంపై సంచాలక్ అయిన అషూరెడ్డి సీరియస్ అవ్వాలి. ఎవరికీ పాస్ లేకుండా యాక్సెస్ ఇవ్వద్దని స్ట్రిక్ట్ గా చెప్పాలి. కానీ, గేమ్ లో ఎవరి స్ట్రాటజీ వాళ్లది, ఎవరిష్టం వాళ్లది అన్నట్లుగా వదిలేసింది.

Click Here To Watch Trailer

బద్ద శత్రువులు అయిన జంటలు టాస్క్ ఆడుతుంటే ఆడియన్స్ కి మాత్రం మంచి కిక్ వచ్చింది. ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ జంటలకి వివిధ ఛాలెంజస్ ని ఇచ్చాడు. ఇందులో గెలిచిన వాళ్లు వేరే జంట పొందిన ఏరియాని లాక్కోవచ్చు. ఫస్ట్ ఛాలెంజ్ లో నటరాజ్ మాస్టర్ ఇంకా యాంకర్ శివలు గెలిచారు. ఇక్కడే సంచాలక్ అయిన అషూరెడ్డి అయోమయానికి గురి అయ్యింది. హౌస్ మేట్స్ జంటలుగా ఈ టాస్క్ లో పాల్గొన్నారు.

ఒకరిని ఇంకొకరు ఉప్పు ఎక్కించుకుని గార్డెన్ ఏరియాలో గీసిన లైన్లో ఈ గేమ్ ఆడాలి. ఇలా భుజంపై ఎక్కినవారు టీపీ ధరించి ఉంటారు. ఆ టోపీని వాళ్లు కాపాడుకోవాలి. వేరే టీమ్ వాళ్లు పడగొట్టే ప్రయత్నం చేయాలి. అయితే, ఈ టోపీని చేతితో పట్టుకోవద్దని సంచాలక్ అషూరెడ్డి చెప్పింది. కానీ, మిగతా హౌస్ మేట్స్ అజ్జర్వ్ చేస్తూ అషూని కన్ఫూజ్ చేసేశారు. అసలు తనని చూడకుండా డిస్టర్బ్ చేసేశారు. దీంతో అషూ అయోమయానికి గురి అయ్యింది. మొదట్లో ఎవరు అవుట్ అయ్యారో చూడలేకపోయింది.

ఈ ఛాలెంజ్ లో లాస్ట్ వరకూ ఉన్న హమీదా- అనిల్, ఇంకా నటరాజ్ మాస్టర్ శివలు గేమ్ చాలా బాగా ఆడారు. కానీ, మద్యలో హమీదా చేతిలో స్టిక్ పడిపోయింది. అది తీసి ఇచ్చే లోపే నటరాజ్ మాస్టర్ హమీదా టోపీని ఎగరకొట్టేశారు. దీంతో హమీదా గేమ్ ని పాజ్ చేయాలి కదా అంటూ సంచాలక్ పై ఆర్గ్యూమెంట్ కి దిగింది. సంచాలక్ గా నువ్వు ఫెయిల్ అయ్యావ్ అంటూ మాట్లాడింది. ఇక రెండో ఛాలెంజ్ సాఫీగా సాగిపోయింది.

మూడో ఛాలెంజ్ లో కూడా నటరాజ్ మాస్టర్ సంచాలక్ అషూ నిర్ణయాన్ని తప్పుబడ్డాడు. అంతకుముందు అఖిల్ కూడా సంచాలక్ అషూపై అసహనాన్ని చూపించాడు. మహేష్ విట్టా సైతం సంచాలక్ గా అషూ సరిగ్గా చేయట్లేదని అన్నీ చూసుకోవాలంటూ కామెంట్స్ చేశాడు. ఓవర్ ఆల్ గా ఈ టాస్క్ లో సంచాలక్ అయిన అషూరెడ్డి అన్ని విషయాలని చూసుకోవడంలో విఫలం అయ్యింది. పక్కన చూసే వాళ్లు కామెంట్స్ చేస్తుంటే వాటిపై ఆర్గ్యూ చేసిందే తప్ప గేమ్ పైన ఫోకస్ మాత్రం చేయలేకపోయింది.

ఎవరు ఎలా ఆడుతున్నారు అనేది పట్టించుకోలేదు. దీంతో నటరాజ్ మాస్టర్ అషూపై సీరియస్ అయ్యారు. చాలా కష్టపడి గేమ్ ఆడుతున్నాను అని, చిన్న పాయింట్ పై ఎలా డిస్ క్వాలిఫై చేశావని నిలదీశారు. చాలాసేపు అషూరెడ్డితో మాట్లాడలేదు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus