బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ ఎమోషన్స్..! అషూ మదర్ ఏం చెప్పిందంటే..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఫ్యామీలీ ఎమోషన్స్ నడుస్తున్నాయి. పార్టిసిపెంట్స్ కి సంబంధించిన కుటుంబసభ్యులు హౌస్ లోకి ఒక్కొక్కరుగా వస్తున్నారు. ముందు ఏ హడావుడి లేకుండా శివ వాళ్ల చెల్లెలు యమున హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. శివ గేమ్ చాలా బాగుందంటూ పొగిడింది. అలాగే, బిందుతో క్లాషెష్ వద్దని ఇద్దరి గేమ్ బయట అందరికీ బాగా నచ్చుతోందని చెప్పింది. నామినేషన్స్ అప్పుడు అషూతో అలా మాట్లాడకుండా ఉండాల్సిందని హెచ్చరించింది.

అంతేకాదు, అషూతో కూడా నామినేషన్స్ అప్పుడు నువ్వు లేడీ గెటప్ టాపిక్ తీయకుండా ఉంటే బాగుండేదంటూ చెప్పింది. చాలాసేపు ఇల్లంతా హుషారుగా తిరుగుతూ సందడి చేసింది యమున. ఇక్కడే శివ లేడీ గెటప్ వేసినపుడు చాలా అందంగా ఉన్నావంటూ ఇంట్లో అందరికీ బాగా నచ్చిందని చెప్పింది. ఊర్లో నాన్న పనికి వెళ్తున్నాడని, నీకు బ్యానర్స్ కూడా కట్టారని చెప్పుకొచ్చింది. యమున వెళ్లిపోయిన తర్వాత అషూరెడ్డి మదర్ చీపురు పట్టుకుని మరీ ఎంట్రీ ఇచ్చింది.

హౌస్ మేట్స్ అందరూ ఫ్రీజ్ లో ఉన్నప్పుడు మైయిన్ డోర్ నుంచీ చీపురు పట్టుకుని నాలుగు పీకేందుకు వచ్చింది అషూ తల్లి. అమ్మా.. కొట్టకే, పరువుపోతుంది అంటూ అషూ కాసేపు టెన్షన్ పడింది. బిగ్ బాస్ రిలీజ్ అనగానే అషూ తన తల్లిని వాటేసుకుంది. ఇక చీపురు పక్కనపెట్టేసి అషూ మదర్ ఇల్లంతా తిరుగుతూ హౌస్ మేట్స్ అందర్నీ పలకరించింది. ఇక్కడే తనకి ఇష్టమైన ప్లేయర్ ఎవరని అషూ ఇండైరెక్టర్ గా విన్నర్ ఎవరు అవుతారో తెలుసుకునే ప్రయత్నం చేసింది.

కానీ, అషూ మదర్ మాత్రం తెలివిగా అందరూ బాగా ఆడుతున్నారంటూ చెప్పుకొచ్చింది. అలాగే, శివని ఎక్కువగా నువ్వు బెడ్ పైనే ఉంటున్నావని, హౌస్ లో వర్క్ కూడా చేయమని హితవు పలకింది. అఖిల్ టాస్క్ లు బాగా ఆడుతున్నావని, అషూతో క్లాషెష్ తగ్గించుకోమని చెప్పింది. ఇండైరెక్ట్ గా అషూ తల్లి అందరి గేమ్ లో లోపాలని చెప్పింది.

ఇక హౌస్ మేట్స్ కూడా ఫ్యామీలీ మెంబర్స్ ఎలాంటి ఇన్ పుట్స్ ఇస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక అషూమదర్ ని చూడగానే అరియానా ఎమోషనల్ అయిపోయింది. ఏడుస్తూ వచ్చి వాటేసుకుంది. ఎక్కువగా ఎమోషనల్ అవ్వొద్దని , ఏడవద్దని అషూ మదర్ చెప్పింది. అషూ వాళ్ల అమ్మ ఇంట్లో నుంచీ వెళ్లిపోగానే పాపని తీసుకుని నటరాజ్ భార్య నీతు గ్రాండ్ గా ఇంట్లోకి వచ్చింది. పాపని చూసిన నటరాజ్ మాస్టర్ ఉబ్బితబ్బిబైపోయాడు. ముద్దులు పెడుతూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు.

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
‘అమెజాన్ ప్రైమ్’ లో అత్యధిక వ్యూస్ ను నమోదు చేసిన తెలుగు సినిమాల లిస్ట్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus