ఆరోవారం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ లో అషూ ఇంకా హమీదా ఇద్దరూ రెచ్చిపోయారు. రోబో టాస్క్ తర్వాత కెప్టెన్సీ పోటీదారులు అయిన ఇద్దరూ ఒకరినొకరు నిందలు వేసుకుంటూ ఓపెన్ అయ్యారు. రోబో టాస్క్ లో హమీదా అషూరెడ్డికి బొమ్మల విషయంలో సపోర్ట్ చేసింది. ఇక్కడే డీల్ మాట్లాడుకుంది. అషూ కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేస్తావా అని అడిగితే, అషూరెడ్డి మాట ఇచ్చింది. అయితే, హౌస్ మేట్స్ కత్తిపోట్లతో కెప్టెన్సీ పోటీ టాస్క్ అనేది మొదలైన తర్వాత ఇద్దరి మద్యలో ఆర్గ్యూమెంట్ వచ్చింది.
బిందు మాధవి అషూరెడ్డికి స్టాప్ చేసేటపుడు హమీదా మద్యలో వచ్చి అషూతో ఆర్గ్యూ చేసింది. నిజానికి అంతకుముందే అజయ్ వచ్చి హమీదాకి కత్తిపోటు గుచ్చాడు. ఇక్కడే హమీదాకి అర్ధమైపోయింది. అషూ కెప్టెన్ అయిపోతుందని ఊహించింది. అంతేకాదు, అజయ్ – అఖిల్ అషూకి కత్తిపోటు పొడవరని గ్రహించింది. గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటూ అజయ్ తో ఆర్గ్యూమెంట్ చేసింది హమీదా. అజయ్ కి హమీదాకి హీటెడ్ ఆర్గ్యూమెంట్ అయ్యింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకువే వరకూ వచ్చారు.
ఇక్కడే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అన్నప్పుడు అఖిల్ కూడా వచ్చి నువ్వు కూడా గ్రూప్ గేమ్ ఆడావని హమీదాపై నింద వేశాడు. నిజానికి రోబో టాస్క్ లో హమీదా తన గేమ్ తను ఆఢింది. ఎక్కువ క్వాయిన్స్ ని బిందు నుంచీ కొట్టేసి స్ట్రాటజీని ప్లే చేసింది. అంతేకాదు అజయ్ ఇచ్చిన రీజన్ కూడా హమీదాకి నచ్చలేదు. ఆ తర్వాత బిందు మాధవి అషూరెడ్డికి రీజన్ చెప్తుంటే, కావాలనే హమీదా అషూని రెచ్చగొట్టింది. తనకి ఇచ్చిన మాట ఏంటి అని ప్రశ్నించింది.
దీంతో అషూరెడ్డి కవర్ చేసుకోవాడనికి ప్రయత్నించింది. కెప్టెన్సీ టాస్క్ లో ఒకవేళ మనిద్దరమే ఉండి ఉంటే నువ్వు నాకు ఇచ్చేదానివా కాదా అని అడిగింది. దాన్ని గివ్ అప్ చేయడమే అని అంటారని ప్రూవ్ చేసింది. ఇక్కడే హమీదాతో ఆర్గ్యూ చేసింది అషూ. ఇద్దరూ చాలాసేపు గేమ్ గురించి మాట్లాడుకున్నారు. నీ మనసులో ఏముందో ఓపెన్ అప్ అవ్వూ అంటూ హమీదా అషూతో వాదించింది. నిజానికి టాస్క్ అప్పుడు డీల్ మాట్లాడుకున్న తర్వాత అషూరెడ్డి మనసులో ఏముందో చెప్పించే ప్రయత్నం మాత్రమే చేసింది హమీదా.
నిజంగా అషూ గివ్ అప్ ఇచ్చినా హమీదా వద్దని చెప్పేది. వాళ్లు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని, నమ్మకం ఎలా ఉంచాలి అనేది రుజువు చేసేందుకే హమీదా ఇలా చేసింది. ఈ విషయంలో హమీదా తప్పులేదని అనిపించింది. అంతేకాదు, బిందు మాధవికి సపోర్ట్ గా కూడా నిలిచింది. ఇక ఒకే ఒక్క కత్తిపోటుతో అషూరెడ్డి ఈవారం కెప్టెన్ గా నిలిచింది. కెప్టెన్ అయ్యాక అషూ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ఆసక్తికరం. ఈవారం సేఫ్ అయితే, మరో వారం అషూకి ఇమ్యూనిటీ లభించినట్లే. అదీ మేటర్.