రామ్ చరణ్ (Ram Charan) పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్ లో తెరకెక్కిన చిరుత (Chirutha) మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ యాక్టింగ్ స్కిల్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించింది. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ కు సంబంధించిన సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
శివం భజే (Shivam Bhaje) సినిమాతో మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అశ్విన్ (Ashwin Babu) చిరుత సినిమాకు టికెట్లు దొరక్కపోతే కాకినాడ నుంచి పిఠాపురంకు వెళ్లి ఉదయం 4.30 గంటలకు సినిమా చూశానని తెలిపారు. గతంలో కాకినాడ పక్కన పిఠాపురం అని పిలిచేవాళ్లని ఇప్పుడు పిఠాపురం పక్కన కాకినాడ అని అంటున్నారని అశ్విన్ కామెంట్లు చేశారు. పిఠాపురంను పవన్ (Pawan Kalyan) ఎక్కడికో తీసుకెళ్లారని అశ్విన్ తెలిపారు.
నేను కూడా పిఠాపురంకు చెందిన వ్యక్తిని అని చెప్పుకోవడానికి ఎంతో సంతోషంగా ఉందని అశ్విన్ పేర్కొన్నారు. అశ్విన్ నటించిన శివం భజే ట్రైలర్ కు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగష్టు నెల 1వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. శివం భజే బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందో లేదో చూడాలి. ఒకింత భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది.
అశ్విన్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని తెలుస్తోంది. చిరుత మూవీ గురించి అశ్విన్ ప్రస్తావించడంతో చరణ్ ఫ్యాన్స్ సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు. గతేడాది హిడింబ (Hidimbha) సినిమాతో అశ్విన్ కు భారీ హిట్ దక్కింది. విభిన్నమైన కథాంశాలను ఎంచుకోవడానికి అశ్విన్ ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. అశ్విన్ టాలెంట్ కు తగ్గ భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.