లవ్ స్టోరీ చెప్పేసిన వేణుస్వామి భార్య.. అలా ప్రేమలో పడ్డామంటూ?

ప్రముఖ జ్యోతిష్కులలో ఒకరైన వేణుస్వామి సెలబ్రిటీల జాతకాల గురించి చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలలో ఆయన చెప్పింది చెప్పిన విధంగా జరుగుతుండటంతో ఎక్కువమంది ఆయనను నమ్ముతున్నారు. సోషల్ మీడియాలో కూడా వేణుస్వామికి ఫ్యాన్ బేస్ ఉంది. సమంత చైతన్య విడాకుల గురించి ముందుగానే ఊహించడం వల్ల వేణుస్వామికి పాపులారిటీ పెరిగింది. అయితే వేణుస్వామి వ్యక్తిగత జీవితం గురించి, ఆయన భార్య గురించి ఎక్కువమందికి తెలియదు.

వేణుస్వామి భార్య పేరు వీణా శ్రీవాణి కాగా వీళ్లిద్దరి మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని తెలిసి చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఒక ఇంటర్య్వూలో వీణా శ్రీవాణి మాట్లాడుతూ మాది లవ్ మ్యారేజ్ అని మా ఆయన తిరుపతి లడ్డూలా ఉంటారని నేను రొమాంటిక్ అని ఆమె చెప్పుకొచ్చారు. ఇంటర్ నుంచి నేను వీణ క్లాసులు చెప్పేదానినని ఆమె కామెంట్లు చేశారు. తనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువని వీణా శ్రీవాణి పేర్కొన్నారు.

రైల్వేలో ఉద్యోగం వచ్చిన తర్వాత ట్రైనింగ్ కొరకు హైదరాబాద్ కు నేను వచ్చానని ఆమె కామెంట్లు చేశారు. ఆ సమయంలో వేణుస్వామి కజిన్ డాటర్ క్లాసులకు వచ్చేవారని ఆ అమ్మాయిని తీసుకెళ్లడానికి వచ్చిన సమయంలో నన్ను చూసి వేణుస్వామి లవ్ ప్రపోజ్ చేశారని వేణుస్వామి భార్య వెల్లడించడం గమనార్హం. నా దృష్టిలో అందం అనేది ముఖ్యం కాదని శ్రీవాణి పేర్కొన్నా రు.

భర్త సలహా ప్రకారం పాటలతో వీణ ప్రదర్శన చేశానని ఆ తర్వాతే మంచి గుర్తింపు వచ్చిందని శ్రీవాణి చెప్పుకొచ్చారు. వీణా శ్రీవాణి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేణుస్వామి వీణా శ్రీవాణి కలిసి ఇంటర్వ్యూలు ఇస్తే బాగుంటుందని కొంతమంది చెబుతున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus