‘సీతా రామం’ ప్రమోషన్స్ లో భాగంగా ఆ చిత్రం నిర్మాత అశ్వినీదత్ చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపాయి. ప్రొడ్యూసర్స్ గిల్డ్ పై అలాగే టికెట్ రేట్స్, హీరోల పారితోషికాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఆయన చురకలు అంటించారు.’ఈ మధ్య కాలంలో థియేటర్లకు జనాలు రావడం తగ్గించారు.దానికి మీరు కారణం ఏమనుకుంటున్నారు?’ అనే ప్రశ్నకి అశ్వినీదత్ మాట్లాడుతూ.. “కరోనా ఒక కారణమని భావిస్తున్నాను. అలాగే టికెట్ రేట్లు ఒక క్రమ పద్ధతి లేకుండా పెంచడం, తగ్గించడం కూడా ఒక కారణం కావొచ్చు. అలాగే చాలా థియేటర్లను చేతిలోకి తీసుకొని స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి రావాలంటే భయపడే స్థాయికి తీసుకొచ్చారు.
ఇదే సమయంలో ఓటీటీలు వచ్చాయి.గిల్డ్ పేరు చెప్పి నిర్మాతలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గరకు వెళ్లి టికెట్ రేట్లు పెంచమని బ్రతిమిలాడి, ఇప్పుడు అవి ఎక్కువైపోయాయి అంటూ తగ్గించుకుంటున్న వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రభుత్వం కూడా తమకు అనుకూలంగా ఉన్న వారి సినిమాలకే టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కలిగించింది. నిర్మాతలే హీరోల పారితోషికాలు పెంచుతారు. భారీగా అడ్వాన్స్ లు ఇచ్చి లాక్ చేసుకుంటారు.
ఇంకో నిర్మాత వద్దకు హీరో వెళ్ళిపోతాడేమో అనే భయంతో వాళ్ళే హీరోలకు ఎక్కువ పారితోషికాలు ముట్టచెప్పడం అలవాటు చేశారు. ఇప్పుడు తగ్గించుకోవాలి అంటున్నారు. కర్ణుడి చావుకి కోటి కారణాలు అని. అలా ఉంది.” అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంలో ఆయన మాట్లాడుతూ… “ఒకప్పుడు నిర్మాతల శ్రేయస్సు కొరకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉండేది. అపుడున్న కౌన్సిల్‌కు ఇపుడు పనిచేస్తోన్న కౌన్సిల్‌కు అసలు పోలికే లేదు.
ఇప్పుడు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. నేను గిల్డ్ సభ్యుడను కాదు ఛాంబర్ లో ఉన్నాను” అంటూ కూడా తెలియజేశారు. అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలకు బండ్ల గణేష్ కూడా మద్దతు పలికారు. ‘హీరోలకి రేంజ్ అనేది ఒకటి ఉంటుంది,కార్లకు ఎలా రేంజ్ అనేది ఉంటుందో. హీరోలకు కూడా ఓ రేంజ్ అనేది అంటుంది.ఏ దర్శకుడు ఏ హీరో కూడా పారితోషికం తగ్గించుకోవలసిన అవసరం లేదు” అంటూ కామెంట్స్ చేశాడు బండ్ల.
Most Recommended Video
అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?