“అశ్వథ్థామ” అసలు లెక్క ఇది..!

నాగశౌర్య, మెహ్రీన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం “అశ్వథ్థామ”. రమణ తేజ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘ఐరా క్రియేషన్స్’ బ్యానర్ పై ఉషా మూల్పూరి నిర్మించారు. జనవరి 31న(రేపు) విడుదల కాబోతుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లు సినిమా పై అంచనాల్ని పెంచాయి. ఇక ఈ చిత్రంతో హీరో నాగ శౌర్య కూడా మంచి హిట్ అందుకోవడం ఖాయం అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.

అయితే “అశ్వథ్థామ” ప్రీ రిలీజ్ కూడా బాగా జరిగింది.

నైజాం 1.80 cr
సీడెడ్ 0.70 cr
ఉత్తరాంధ్ర 0.44 cr
ఆంధ్ర 2.50 cr
ఏపీ+తెలంగాణ 5 cr (6cr with P&P)
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.40 cr
ఓవర్సీస్ 1.20 cr
వరల్డ్ వైడ్ టోటల్ 6.60 cr (7.60 with P&P)

అదండీ.. “అశ్వథ్థామ” చిత్రానికి మొత్తంగా 7.60 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 8కోట్ల వరకూ కలెక్షన్స్ ను రాబట్టాల్సి ఉంది. ఇప్పట్లో కొత్త సినిమాలు ఏమీ లేకపోవడం ఈ చిత్రానికి అడ్వాంటేజ్ అని చెప్పాలి. పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ సాధించడం చాలా ఈజీ అనే చెప్పాలి. నాగశౌర్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘ఛలో’ చిత్రం ఏకంగా 12కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus