Athadu: మహేష్ బాబు అతడు బుల్లితెరపై అన్నిసార్లు ప్రసారమైందా.. రేర్ రికార్డ్ అంటూ?

గతంతో పోల్చి చూస్తే బుల్లితెరపై సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గింది. యూట్యూబ్, ప్రముఖ ఓటీటీల ద్వారా సినిమాలను చూసే అవకాశం ఉండటంతో ప్రేక్షకులు బుల్లితెరపై సినిమాలను చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే బుల్లితెరపై మహేష్ బాబు అతడు మూవీ మాత్రం రేర్ రికార్డ్ ను సొంతం చేసుకుని ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించింది. ఈ సినిమా స్టార్ మా, మా మూవీస్ ఛానల్స్ లో ఇప్పటివరకు 2020 నాటికి 1350 కంటే ఎక్కువసార్లు ప్రదర్శితమైంది.

అతడు (Athadu) మూవీ ఎన్నిసార్లు టీవీలో ప్రసారమైనా ప్రేక్షకులకు బోర్ కొట్టదు. అందుకే ఈ అరుదైన రికార్డ్ సొంతమైంది. బుల్లితెరపై మరే మూవీ 1000 సార్లు కూడా ప్రసారం కాలేదు. అతడు సినిమా సాధించిన రికార్డును మరే సినిమా కూడా బ్రేక్ చేయలేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అతడు సినిమాకు మాత్రమే ఈ అరుదైన ఘనత సొంతం కావడంతో మహేష్ అభిమానులు సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు.

బుల్లితెరపై మహేష్ కు మాత్రమే సొంతమైన ఈ రికార్డ్ విషయంలో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉండగా సంక్రాంతి కానుకగా రికార్డ్ స్థాయిలో థియేటర్లలో రిలీజ్ కానుంది. మహేష్ తర్వాత ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహేష్ రాజమౌళి కాంబో మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని తెలుస్తోంది.

మహేష్ జక్కన్న కాంబో మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండనుందని తెలుస్తోంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్ కు ముందే ఈ సినిమాకు భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. 2026 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. మహేష్ జక్కన్న కాంబో మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus