సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ పుట్టినరోజును పురస్కరించుకుని ‘అతడు’ చిత్రాన్ని 4K లో రీ- రిలీజ్ చేశారు. ఆగస్టు 9న రీ రిలీజ్ అయిన ‘అతడు’ చిత్రాన్ని చూడటానికి మహేష్ అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్, కామన్ ఆడియన్స్ కూడా ఎగబడ్డారు. థియేటర్లలో రీ- క్రియేషన్ వీడియోలతో కొందరు అభిమానులు చేసిన రచ్చ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.
అలాగే తమ అభిమాన హీరో పుట్టినరోజుని ‘అతడు’ రీ రిలీజ్ తో అభిమానులు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనే చెప్పాలి. మరి మొదటి రోజు ‘అతడు’ రీ- రిలీజ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 1.62 cr |
సీడెడ్ | 0.25 cr |
ఉత్తరాంధ్ర | 0.28 cr |
ఈస్ట్ | 0.22 cr |
వెస్ట్ | 0.20 cr |
గుంటూరు | 0.24 cr |
కృష్ణా | 0.25 cr |
నెల్లూరు | 0.08 cr |
ఏపీ+తెలంగాణ | 3.14 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.28 cr |
ఓవర్సీస్ | 1.0 cr |
వరల్డ్ టోటల్ | 4.42 cr (గ్రాస్) |
‘అతడు'(4K) రీ రిలీజ్లో కూడా భారీ వసూళ్లు సాధించింది.’కింగ్డమ్’ వంటి సినిమాలకి థియేటర్లు ఎక్కువగా హోల్డ్ చేయడం వల్ల ‘ఖలేజా’ రీ రిలీజ్ కి దొరికినన్ని స్క్రీన్స్ ‘అతడు’ రీ రిలీజ్ కు దొరకలేదు. అలాగే వర్షాలు వంటి ప్రతికూల పరిస్థితుల కారణంగా రికార్డులైతే కొట్టలేదు కానీ.. రీ- రిలీజ్ సినిమాల్లో మహేష్ బాబు సినిమాలకు తిరుగులేదు అని ‘అతడు’ తో మరోసారి ప్రూవ్ అయ్యింది.