పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ,మాటల మాంత్రికుడు- స్టార్ డైరెక్టర్ అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కాంబినేషన్లో ‘జల్సా’ (Jalsa) తర్వాత ‘అత్తారింటికి దారేది’ (Atharintiki Daaredi) అనే సినిమా వచ్చింది. సమంత (Samantha)Nadhiya, ప్రణీత ( Pranitha Subhash) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ (B. V. S. N. Prasad) నిర్మించారు. 2013 వ సంవత్సరం సెప్టెంబర్ 27న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ఆ టైంలో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం జరుగుతుంది. అందులో భాగంగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి.
అప్పుడప్పుడే తెరుచుకుంటున్న టైంలో ‘అత్తారింటికి దారేది’ సడన్ గా రిలీజ్ అయ్యింది. అయినప్పటికీ థియేటర్లలో ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడింది. ‘మగధీర’ (Magadheera) కలెక్షన్స్ ని అధిగమించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నేటితో ‘అత్తారింటికి దారేది’ రిలీజ్ అయ్యి 11 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఒకసారి ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 23.25 cr |
సీడెడ్ | 10.46 cr |
ఉత్తరాంధ్ర | 6.22 cr |
ఈస్ట్ | 4.07 cr |
వెస్ట్ | 3.38 cr |
గుంటూరు | 5.25 cr |
కృష్ణా | 3.72 cr |
నెల్లూరు | 2.63 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 58.98 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 7.11 cr |
ఓవర్సీస్ | 8.90 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 74.99 cr |
‘అత్తారింటికి దారేది’ (Atharintiki Daaredi) బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.51 కోట్లు. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని విధంగా రూ.74.99 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బయ్యర్స్ కి రూ. 23 కోట్ల వరకు లాభాలు మిగిల్చింది.