పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో చిత్రం ‘అత్తారింటికి దారేది’. ఈ కాంబినేషన్లో ‘జల్సా’ వంటి సూపర్ హిట్ రావడం.. అలాగే ‘గబ్బర్ సింగ్’ తో పవన్ కళ్యాణ్ కంబ్యాక్ ఇవ్వడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2013 వ సంవత్సరం సెప్టెంబర్ 27న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ప్రత్యేక తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా ఆ టైంలో ఈ సినిమా రిలీజ్ టైంకి థియేటర్లు మూతపడ్డాయి.
అదే టైంలో ఊహించని విధంగా ‘అత్తారింటికి దారేది’ సినిమా నెట్లో లీక్ అయ్యింది. దీంతో అప్పటికప్పుడే రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్ర బృందం. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇక సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ మూవీ మొదట జనాలు వస్తారు అని ఎవ్వరూ ఊహించలేదు. కానీ మొదటి షో నుండే సినిమా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకోవడంతో పైరసీని పట్టించుకోకుండా జనాలు ఎగబడి థియేటర్ కు వచ్చారు.
ఫుల్ రన్లో ఈ మూవీ ‘మగథీర’ కలెక్షన్లను అధిగమించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 9 ఏళ్ళు పూర్తి కావస్తున్న సందర్భంగా ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
23.25 cr
సీడెడ్
10.46 cr
ఉత్తరాంధ్ర
6.22 cr
ఈస్ట్
4.07 cr
వెస్ట్
3.38 cr
గుంటూరు
5.25 cr
కృష్ణా
3.72 cr
నెల్లూరు
2.63 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
58.98 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
7.11 cr
ఓవర్సీస్
8.90 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
74.99 cr
‘అత్తారింటికి దారేది’ చిత్రం రూ.51 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ మూవీ రూ.74.99 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి అంతకు ముందు రాజమౌళి- రాంచరణ్ ల ఇండస్ట్రీ హిట్ ‘మగధీర’ పేరుతో ఉన్న రూ.73.46 కోట్ల షేర్ ను అధిగమించి ఇండస్ట్రీ హిట్ స్టేటస్ ను దక్కించుకుంది ‘అత్తారింటికి దారేది’.