Atlee: బన్నీతోనే మూడో సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న అట్లీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) – అట్లీ (Atlee Kumar)  కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీపై అంచనాలు రోజురోజుకీ మరింత పెరుగుతున్నాయి. ‘పుష్ప 2’ (Pushpa 2) తర్వాత బన్నీ నటించనున్న ఈ చిత్రం, ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే భారీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందట. అయితే ఇందులో అల్లు అర్జున్ క్యారెక్టర్ డిజైన్‌ గురించి తాజా అప్డేట్ ఫిల్మ్ నగర్‌లో హీట్ పెంచుతోంది.

Atlee

ఇప్పటి వరకు బన్నీ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్నట్టు ప్రచారం సాగగా, తాజా లీకుల ప్రకారం మూడో పాత్ర కూడా అతడే పోషించనున్నాడట. ఇందులో రెండు క్యారెక్టర్లు హీరోలుగా ఉంటే, మూడో క్యారెక్టర్ పూర్తిగా నెగటివ్ షేడ్‌తో ఉంటుందట. ఈ త్రీ లేయర్ రోల్‌కి స్క్రిప్ట్ పరంగా బలం ఉన్న నేపథ్యంలో అట్లీ అలాంటి ప్రయోగానికి వెళ్లాడని సమాచారం. ఈ ముగ్గురు పాత్రలకు లుక్స్, బాడీ లాంగ్వేజ్, టోన్ అన్నీ వేర్వేరు రీతిలో ఉండేలా డిజైన్ చేస్తున్నారట.

ఈ సినిమా ద్వారా బన్నీ మరోసారి తన నటనను విభిన్నంగా చూపించబోతున్నాడు. ‘పుష్ప’లోని (Pushpa) గ్రే షేడ్స్‌తో ఉన్న కథానాయకుడి తరహాలో కాకుండా, ఈ సినిమాలో సాక్షాత్తూ విలన్ క్యారెక్టర్ కూడా అల్లు అర్జున్ చేస్తుండటంతో ఆసక్తి మరింత పెరిగింది. హీరో, విలన్ రెండూ ఒకే వ్యక్తిగా ఉండడం కొత్తది కాదు కానీ, స్టార్ హీరోల విషయంలో ఇది రేర్ కాంబినేషన్ అవుతుంది. అట్లీ దృష్టిలో ఇది భారీ మాస్ కంటెంట్‌తో గేమ్‌చేంజర్ కానున్నట్టు తెలుస్తోంది.

ఇతర విషయాలకొస్తే, సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉండబోతున్నట్టు సమాచారం. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణే (Deepika Padukone)  మెయిన్ హీరోయిన్‌గా ఎంపికై ఉండే అవకాశం ఉన్నట్టు టాక్. మరో రెండు పాత్రలకు నేషనల్ లెవెల్ నటి, అలాగే సౌత్ నుంచి మరో స్టార్ హీరోయిన్‌ను తీసుకునే దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఇందులో టెక్నికల్ టీమ్‌ కూడా అత్యున్నత స్థాయిలో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా టేకాఫ్ అయి సెట్స్ మీదకు వెళ్లే సమయానికి అధికారిక ప్రకటనలతో స్పష్టత రావొచ్చు, బన్నీ నటనకు ఇది కొత్త ట్రెండ్ సెట్టర్ గా మారనుందన్నది మాత్రం స్పష్టమే.

అనిల్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిన చిరు.. కారణం అదే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus