తన హీరోలని, హీరోయిన్లని, నటీనటులందరినీ కంఫర్ట్ జోన్లో పెట్టి తనకు కావాల్సిన ఔట్పుట్ రాబట్టుకోవడంలో దర్శకుడు అనిల్ రావిపూడిని మించిన వాళ్ళు లేరు అనే చెప్పాలి. బాలయ్య (Nandamuri Balakrishna) వంటి టఫ్ పర్సన్స్ ను కూడా సెట్స్ లో లైటర్ వేన్లోకి మార్చేస్తుంటాడు అనిల్(Anil Ravipudi). అందుకే అతని సినిమాల్లో హీరో, హీరోయిన్లు మాత్రమే కాదు అందరూ కూడా చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తారు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కూడా ఆ ఎనర్జీని ఫీలవుతాడు.
నయనతార (Nayanthara) వంటి స్టార్ హీరోయిన్ ప్రమోషన్స్ కి చాలా దూరంగా ఉంటుంది. అలాంటి ఆమె ఇంకా సెట్స్ లోకి అడుగుపెట్టకుండానే చిరు సినిమాని ఓకే చేసినట్లు ఓ వీడియో చేసింది అంటే అనిల్ రావిపూడి టాలెంట్ ను అర్థం చేసుకోవచ్చు. ఇక హీరో చిరంజీవి (Chiranjeevi) కూడా తన ప్రతి సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎంతో కొంత ఇన్వాల్వ్ అయ్యి.. దర్శకులకి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు.ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూడా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు.
కానీ అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా విషయంలో ఆయన పూర్తి నమ్మకంతో ఉన్నారట. అనిల్ స్క్రిప్ట్ విన్నాక.. పూర్తిగా అతనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారట. కూతురు సుస్మిత కొణిదెల (Sushmita Konidela) నిర్మాత అనే టెన్షన్ కూడా లేకుండా అన్నీ ‘అనిల్ చూసుకుంటాడులే’ అనే అభిప్రాయానికి వచ్చేశారట చిరు. అంతలా అనిల్ కి చిరు ఇంప్రెస్ అయిపోయినట్టు అర్థం చేసుకోవచ్చు. మే 20న ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది.
5 వారాల పాటు నాన్ స్టాప్ గా జరిగే షెడ్యూల్ ఇది. తర్వాత చిరుకి బ్రేక్ ఇస్తాడట అనిల్. ఆ తర్వాత చిరు లేని ఎపిసోడ్స్ చిత్రీకరిస్తారు. బర్త్ డే కి ముందు చిరుతో మళ్ళీ చిన్న షెడ్యూల్ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఆగస్టుకి టీజర్ లేదా గ్లింప్స్ ఇచ్చే ఆలోచనలో కూడా అనిల్ ఉన్నట్టు తెలుస్తుంది. సో చిరుని ఏమాత్రం కంగారు పెట్టకుండా నవంబర్ కి సినిమాని కంప్లీట్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకున్నాడట అనిల్ రావిపూడి.