కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా మణిరత్నం(Mani Ratnam) దర్శకత్వంలో దాదాపు 38 ఏళ్ళ తర్వాత రాబోతున్న సినిమా ‘థగ్ లైఫ్'(Thug Life) . ‘రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్’ ‘మద్రాస్ టాకీస్’ బ్యానర్ల పై కమల్ హాసన్, మణిరత్నం కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ఈ సినిమాని ‘శ్రేష్ట్ మూవీస్’ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి రిలీజ్ చేస్తున్నారు. జూన్ 5 న ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్ ని వదిలారు.
ఈ ట్రైలర్ 2 నిమిషాల నిడివి కలిగి ఉంది. తన ప్రాణాలు కాపాడిన ఓ పిల్లాడిని చిన్నప్పటి నుండి చేరదీసి పెంచుతాడు రంగరాయ శక్తివేల్ నాయకర్(కమల్ హాసన్). అతను పెంచిన కుర్రాడు అమర్(శింబు)Silambarasan). అమర్ తనకు అన్నీ నమ్మే శక్తివేల్.. ఊహించని విధంగా అతని చేతిలో మోసపోతాడు. అందువల్ల కుటుంబానికి దూరమవుతాడు. తర్వాత వీరిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంటుంది. వీటన్నిటికీ గల కారణాలు ఏంటి? అనే సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ ట్రైలర్ ను కట్ చేశారు.
ఈ ట్రైలర్లో విజువల్స్ టాప్ నాచ్ అనే విధంగా ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ (A.R.Rahman)బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హాలీవుడ్ సినిమాలను తలపించే విధంగా అనిపించింది. ఇక ట్రైలర్లో త్రిష (Trisha) .. తో కమల్ రొమాన్స్ అలాగే అభిరామితో లిప్ లాక్ వంటివి కూడా హైలెట్ అయ్యాయి. అవి వైరల్ అవ్వొచ్చు. దర్శకుడు మణిరత్నం మార్క్ ఎమోషన్ కూడా మిస్ అవ్వలేదు. మీరు కూడా ట్రైలర్ ను ఓ లుక్కేయండి :